వరలక్ష్మీ శరత్ కుమార్.. శరత్ బాబు కుమార్తె గా సినీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈమెకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని, క్రేజ్ ని ఏర్పరుచుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. నార్మల్ గా వారసులు అంటే ఏ హీరో గానో, హీరోయిన్ గానో చేయాలనుకుంటారు కానీ ఈమె మాత్రం భిన్నంగా విలన్ రోల్స్ చేస్తూ పైకి ఎదిగింది.. ఈమధ్య కాలంలో ఈ బొద్దు గుమ్మ కి వచ్చిన పేరు ఏ హీరోయిన్ కి రాలేదని చెప్పాలి. లాక్ డౌన్ తర్వాత రిలీజ్ అయిన సినిమాలో వరలక్ష్మీ కి మంచి పాత్ర లు పడడంతో పాటు ఆయా సినిమాలు కూడా సూపర్ హిట్ అవడంతో ఒక్కసారిగా ఆమె క్రేజ్ ఆకాశాన్ని అంటింది..ఆమె నటించిన రవితేజ నటించిన క్రాక్ సినిమా ఏలెవెల్లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే..

అందుకు కారణం వరలక్ష్మీ పోషించిన జయమ్మ పాత్ర కూడా ఓ కారణం.. అలాగే ఆమె నటించిన నాంది సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటిదాకా కామెడీ సినిమాలు చేస్తూ అలరించిన నరేష్ ఈ జోనర్ లోచేసి మంచి హిట్ కొట్టాడు. వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇందులో లాయర్ ఆద్యగా కనిపించి తనదైన శైలి యాక్టింగ్‌తో మెప్పించింది. రీసెంట్‌గా తన 36వ పుట్టినరోజు వేడుకని జరుపుకున్న వరలక్ష్మీ.. పెళ్లి ఎప్పుడు అంటే కస్సుబుస్సులాడింది. మీడియాని కర్రొట్టుకు కొట్టినంత పని చేసింది.న 36వ పుట్టినరోజు వేడుకలను అనాథ పిల్లల సమక్షంలో జరుపుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్.
అయితే అక్కడికి మీడియా చేరుకుని.. అన్ని కుశల ప్రశ్నలు, సినిమా ప్రశ్నలు అడిగిన తర్వాత పర్సనల్ వ్యవహారాల్లోకి కూడా వెళ్లి.. పెళ్లి అన్నారట. అంతే ఆమె భగ్గున మండిందట. ఇక క్లాస్ తీసుకుంది చూడండి.. అబ్బో.. ఇది చెప్పే కంటే.. కళ్లారా చూసుంటే భలే కిక్ వచ్చేది. మైక్ పట్టుకుంటే చాలు మీకు నా పెళ్లి గురించే గుర్తుకు వస్తుందా? మహిళగా జన్మించినవారు పెళ్లి చేసుకోవాలని ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా ఏంటి? ఎప్పుడూ అదే ప్రశ్నా.. ఇంక మీకు వేరే పని ఉండదా? అంటూ కాస్త గట్టిగానే వేసుకుంది. అంతే.. దెబ్బకి మీడియా వారంత సైలెంట్ అయిపోయారు. మారు మాట్లాడలేదంటే నమ్మండి. అసలే ఫైర్ బ్రాండాయే.































