Varudu Movie: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక ప్రవాహం లాంటిది. ఇక్కడికి ఎంతోమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం వస్తుంటారు. అయితే కొందరు ఇండస్ట్రీలో సక్సెస్ సాధించి కొంతకాలం పాటు ఇండస్ట్రీలో నిలబడగా మరి కొందరు మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు.
ఇలా ఒకటి రెండు సినిమాలకే ఇండస్ట్రీ నుంచి దూరమైనటువంటి వారిలో వరుడు సినిమా హీరోయిన్ భాను శ్రీ ఒకరు.గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం వరుడు ఐదు రోజుల పెళ్లి కాన్సెప్ట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇందులో విలన్ పాత్రలో తమిళ హీరో ఆర్య నటించారు. ఇలా ఐదు రోజుల పెళ్లి కాన్సెప్ట్ తో హీరోయిన్ ను సస్పెన్స్ లో పెట్టి ఈ సినిమాని గుణశేఖర్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఇలా ఈయన హీరోయిన్ విషయంలో సస్పెన్స్ క్రియేట్ చేయడంతో అప్పట్లో హీరోయిన్ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అసలు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే కుతూహలం అందరిలో పెంచేశారు.ఈ విధంగా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనటువంటి ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.
ఈ విధంగా వరుడు సినిమా సక్సెస్ కాకపోవడమే కాకుండా ఈమె అనంతరం తెలుగులో నటించిన పలు సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా భాను శ్రీ గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈమె లేటెస్ట్ ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె అప్పటికి ఇప్పటికీ ఒకటే అందంతో ఉండి అందరిని ఆకట్టుకుంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…