Movie News

Shreya Ghoshal: ఆయనే నాకు స్ఫూర్తి… అందుకే నన్ను ప్రజలు ఆదరిస్తున్నారు: సింగర్ శ్రేయ ఘోషల్

Shreya Ghoshal: సింగర్ శ్రేయ ఘోషల్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ఏ సినిమాలోనైనా ఒక పాట పాడింది అంటే ఆ సినిమా సూపర్ హిట్ కావాల్సిందే. అంత తీయని గాత్రంతో ఎన్నో భాషలలో పాటలను ఆలపిస్తూ ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకున్న శ్రేయ ఘోషల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా శ్రేయ ఘోషల్ మాట్లాడుతూ నాకు తొలి సినిమా దేవదాసు ఈ సినిమాలో ఓ పాట రికార్డింగ్ చేస్తున్న సమయంలో స్టూడియో మొత్తం ప్రముఖ సంగీత దర్శకులు సంగీత విద్వాంశలతో నిండిపోయింది. ఆ సంఘటన ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతూ ఉందని తెలిపారు.

తాను ఆలపించిన పాటలలో భైరి పియా…అంటూ సాగే ఆ పాటకు జాతీయ అవార్డును గెలుచుకుంటానని అప్పుడు అనుకోలేదు. ఇక నేను దేవదాసు సినిమాలో పాట పాడే సమయంలో తనకు పదహారేళ్ళ వయసు అని అయితే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్దగా మారింది ఏమీ లేదు అనిపిస్తుంది. ఇప్పటికి నేను చిన్నపిల్లను అనే ఫీలింగ్ కలుగుతుంది.

Shreya Ghoshal: చేస్తున్న పనులలో కూడా సంగీతంపై ఇష్టత కనబడుతుంది…

దర్శకుడు సంజలీల బన్సాలీ అప్పటికీ ఇప్పటికీ అదే అభి రుచితో ఉన్నారని ఆయనకు దర్శకత్వంలోనే కాకుండా సంగీతంలో కూడా మంచిపట్టు ఉందని తెలిపారు. తనకు ఆయనే స్ఫూర్తి అని శ్రేయ ఘోషల్ వెల్లడించారు.ఇక తాను ఇంట్లో ఉన్నా కూడా తను చేస్తున్న పనులలో తనకు సంగీతం అంటే ఎంతో ఇష్టం అనే విషయం అందరికీ తెలుస్తుందని, సంగీతం పట్ల నాకున్న ప్రేమే.. ఇప్పుడు నన్ను సంగీత ప్రపంచంలో ఈ స్థాయిలో నిలబెట్టిందని సంగీతంపై ఉన్న ఇష్టమే నన్ను ప్రజలు ఆదరిస్తున్నారని ఈ సందర్భంగా శ్రేయ ఘోషల్ వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago