Shreya Ghoshal: సింగర్ శ్రేయ ఘోషల్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ఏ సినిమాలోనైనా ఒక పాట పాడింది అంటే ఆ సినిమా సూపర్ హిట్ కావాల్సిందే. అంత తీయని గాత్రంతో ఎన్నో భాషలలో పాటలను ఆలపిస్తూ ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకున్న శ్రేయ ఘోషల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా శ్రేయ ఘోషల్ మాట్లాడుతూ నాకు తొలి సినిమా దేవదాసు ఈ సినిమాలో ఓ పాట రికార్డింగ్ చేస్తున్న సమయంలో స్టూడియో మొత్తం ప్రముఖ సంగీత దర్శకులు సంగీత విద్వాంశలతో నిండిపోయింది. ఆ సంఘటన ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతూ ఉందని తెలిపారు.
తాను ఆలపించిన పాటలలో భైరి పియా…అంటూ సాగే ఆ పాటకు జాతీయ అవార్డును గెలుచుకుంటానని అప్పుడు అనుకోలేదు. ఇక నేను దేవదాసు సినిమాలో పాట పాడే సమయంలో తనకు పదహారేళ్ళ వయసు అని అయితే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్దగా మారింది ఏమీ లేదు అనిపిస్తుంది. ఇప్పటికి నేను చిన్నపిల్లను అనే ఫీలింగ్ కలుగుతుంది.

Shreya Ghoshal: చేస్తున్న పనులలో కూడా సంగీతంపై ఇష్టత కనబడుతుంది…
దర్శకుడు సంజలీల బన్సాలీ అప్పటికీ ఇప్పటికీ అదే అభి రుచితో ఉన్నారని ఆయనకు దర్శకత్వంలోనే కాకుండా సంగీతంలో కూడా మంచిపట్టు ఉందని తెలిపారు. తనకు ఆయనే స్ఫూర్తి అని శ్రేయ ఘోషల్ వెల్లడించారు.ఇక తాను ఇంట్లో ఉన్నా కూడా తను చేస్తున్న పనులలో తనకు సంగీతం అంటే ఎంతో ఇష్టం అనే విషయం అందరికీ తెలుస్తుందని, సంగీతం పట్ల నాకున్న ప్రేమే.. ఇప్పుడు నన్ను సంగీత ప్రపంచంలో ఈ స్థాయిలో నిలబెట్టిందని సంగీతంపై ఉన్న ఇష్టమే నన్ను ప్రజలు ఆదరిస్తున్నారని ఈ సందర్భంగా శ్రేయ ఘోషల్ వెల్లడించారు.































