Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవ దారి అర్జున సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఈనెల 25వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి వరుణ్ తేజ్ తన సినిమాల గురించి అలాగే వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు మెగా ఫ్యామిలీ నుంచి మల్టీ స్టార్ సినిమాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ఇప్పటికే మెగా హీరోలు కలిసి మల్టీ స్టార్ సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే త్వరలో ఇంకా ఇలాంటి మల్టీ స్టార్ సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు వరుణ్ తేజ్ సమాధానం చెబుతూ మంచి కథ దొరికితే తప్పకుండా మల్టీ స్టార్ సినిమాలలో నటిస్తామని తెలిపారు. దర్శకులు కూడా అలాంటి కథతో వస్తే తప్పకుండా మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తాము అంటూ ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మెగా హీరోల మల్టీ స్టార్ సినిమాల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ హీరోలుగా ఆచార్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ మల్టీ స్టార్ గా బ్రో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ రెండు సినిమాలు ఊహించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…