Mokshagna: మోక్షజ్ఞ పరిచయం అవసరం లేని పేరు.. నందమూరి నట సింహం బాలకృష్ణ వారసుడిగా ఈయన అందరికీ ఎంతో సుపరిచితమే.అయితే బాలకృష్ణ తో పాటు సమానంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి హీరోల పిల్లలు ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సినిమాలలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ క్రమంలోనే నందమూరి అభిమానులు బాలయ్య కుమారుడి కోసం ఎదురుచూస్తున్నారు.
బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారా ఎప్పుడు ఈయన ఇండస్ట్రీలోకి రాబోతున్నారా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అయితే గత ఐదు సంవత్సరాలుగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇదిగో అదిగో అంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడ లేదు.
ఇకపోతే ఈ ఏడాది కచ్చితంగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉండబోతుంది అంటూ బాలకృష్ణ కూడా ధీమా వ్యక్తం చేశారు అయితే తాజాగా మోక్షజ్ఞ జాతకం గురించి ఆయన సినీ కెరియర్ గురించి వేణు స్వామి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు మోక్షజ్ఞ ప్రస్తావన రాగా ఈయన జాతకం చూసారా ఆయన జాతకం ఎలా ఉండబోతోంది అంటూ యాంకర్ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు వేణు స్వామి సమాధానం చెబుతూ తాను మోక్షజ్ఞ జాతకం చూసానని ఆయన కెరియర్ పరంగా ఎంతో అద్భుతమైన జాతకం అని తెలిపారు. సినిమా ఇండస్ట్రీలోనే ఎంతో మంచి సక్సెస్ అందుకుంటారని వేణు స్వామి తెలిపారు. అయితే ఆయన మరో మూడు సంవత్సరాల పాటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టరో అంటూ వేణు స్వామి చేసినటువంటి ఈ కామెంట్ నందమూరి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…