Veerasimha Reddy: బాలకృష్ణ అఖండ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత నటించిన చిత్రం వీర సింహారెడ్డి. ఈ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా మొదటి షో నుంచి అద్భుతమైన టాక్ సొంతం చేసుకొని థియేటర్లలో ప్రేక్షకులను సందడిచేస్తోంది.
ఇక బాలయ్యకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా విదేశాలలో కూడా అభిమానులు ఉన్నారనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికాలోఒక థియేటర్లో వీర సింహారెడ్డి సినిమా ప్రసారం కాగా బాలయ్య ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రచ్చ చేశారు. జై బాలయ్య అంటూ గట్టిగా కేకలు వేయడమే కాకుండా పెద్ద ఎత్తున పేపర్లు గాలిలోకి విసురుతో ఈ సినిమాని ఎంజాయ్ చేశారు.
అయితే థియేటర్లో ప్రేక్షకులు అత్యుత్సాహం కనబరచడంతో థియేటర్ యాజమాన్యం షో మధ్యలో నిలిపివేశారు. ఇలాఇప్పటివరకు ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి కానీ ఏ సినిమా విషయంలోనూ ఇలా జరగలేదని యాజమాన్యం వెల్లడించారు. ఆయనప్పటికీ బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లో కేకలు వేస్తూ ఉండడంతో చేసేదేమీ లేక థియేటర్ యాజమాన్యం షో ఆపివేసి ప్రేక్షకులందరినీ బయటకు పంపించేశారు.
ఇక మరొక థియేటర్లో కూడా ప్రేక్షకులు గట్టిగా జై బాలయ్య అంటూ కేకలు వేయడంతో థియేటర్ యాజమాన్యం అరవకూడదంటూ ప్రేక్షకులకు హెచ్చరించారు. ఏది ఏమైనా బాలయ్య సినిమా విడుదలైన సందర్భంగా అభిమానుల హంగామా మామూలుగా లేదని చెప్పాలి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అభిమానులు థియేటర్ల ముందు కటౌట్లకు పాలాభిషేకంతో పాటు రక్తంతో కూడా అభిషేకం చేశారు అలాగే కొన్ని చోట్ల థియేటర్ల ముందు మేకపోతులను కూడా బలి ఇవ్వడం గమనార్హం.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…