Featured

Waltair Veerayya twitter review : వాల్తేరు వీరయ్య సినిమా హిట్టు కొట్టినట్టేనా… సినిమాపై మొదటి ట్విట్టర్ రివ్యూ…!

Waltair Veerayya twitter review : మెగాస్టార్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో వై.రవిశంకర్ మరియు నవీన్ యెర్నేని నిర్మించారు. శృతి హాసన్ హీరోయిన్ కాగా మాస్ మహారాజ్ రవితేజ ఒక కీలక పాత్ర పోషించారు. గాడ్ ఫాదర్ మూవీ హిట్ తరువాత బాస్ సినిమా కావడంతో అందులోనూ రవితేజ కూడా ఉండటంతో ప్రేక్షకులలో సినిమాపై బాగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్ షో పడిపోవడంతో, సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ట్విట్టర్ లో పంచుకుంటున్నారు.

వాల్తేరు వీరయ్య కథనం ఎలా ఉంది…

ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ మరియు పాటలు మంచి క్రేజ్ తో సినిమా మీద అంచనాలను మరింతగా పెంచాయి. జనవరి 13న సినిమా రిలీజ్ అయి మిశ్రమ స్పందనతో దూసుకుపోతోందనే టాక్ వినిపిస్తోంది. చిరంజీవి నటన, డాన్స్, కామెడీ బాగుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ బాస్ ఇమేజ్ తగ్గట్టు లేదని, నేరేషన్ బాగా ఫ్లాట్ గా ఉందని, సెకండ్ హాఫ్ కూడా ఏమంత ఆకట్టుకునేలా లేదని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. మరికొందరు సినిమా చాలా బాగుంది, పూర్వం బాస్ మళ్ళీ తిరిగివచ్చాడు అని కామెంట్ చేస్తున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ ర్యాంప్, కామెడీ, ఇంటర్వల్ సీన్ ఇంకా ఫైట్స్ బాగున్నాయి అని కొంతమది కామెంట్ చేశారు.

చిరు, రవితేజ మధ్య సీన్స్ అలానే కామెడీ బాగానే పేలిందంటూ చెబుతున్న ఎమోషనల్ సీన్స్ అంతగా వర్క్ అవుట్ అవలేదంటూ కొందరు నెటిజన్స్ భావిస్తున్నారు. మొత్తానికి వాల్తేరు వీరయ్య వన్ మాన్ షో అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఫాన్స్ కి ఒకే కానీ కామన్ ఆడియన్ కి మాత్రం యావరేజ్ కమర్షియల్ సినిమా గాచెప్పొచ్చు. అయితే సినిమా ఫుల్ రివ్యూ రావాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago