Venky Atluri: తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా మంచి సక్సెస్ అందుకున్న వెంకీ అట్లూరి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈయన ఇటీవల లక్కీ భాస్కర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించారు. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఈ తరుణంలోనే వెంకీ అట్లూరి తెలుగు హీరోలకు రొటీన్ ప్రేమకథ సినిమాలు చేస్తారు కానీ బయట హీరోలతో మాత్రం ఎంతో విభిన్నమైన కథలను సినిమాలుగా చేస్తూ మంచి హిట్స్ అందిస్తున్నారు అంటూ ఈయనపై విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ విమర్శలపై వెంకీ అట్లూరి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
లక్కీ భాస్కర్ సినిమా కంటే ముందుగానే హీరో ధనుష్ తో సార్ అనే సినిమా చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా కథను మన టాలీవుడ్ హీరోలకు చెప్పినప్పుడు ఎవరు కూడా ఈ సినిమాకి ఓకే చేయలేదు. హ్యాపీ ఎండింగ్ లేదు అంటూ చాలా మంది ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. ఇలా తెలుగు వాళ్ళందరూ కూడా ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో తాను తమిళ హీరో ధనుష్ ను కలిసి ఆయనకు కథ చెప్పాను..
ఈ విధంగా ధనుష్ కు కథ చెప్పడంతో ఎప్పుడు సినిమా స్టార్ట్ చేద్దాం అంటూ తన డేట్స్ ఇచ్చారు.. మన టాలీవుడ్ ప్రేక్షకులకు, నిర్మాతలకు ఒక సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు హ్యాపీగా బయటకు రావాలి అందుకే ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. కానీ ధనుష్ గారు ఈ సినిమాకి ఓకే చేయడంతో నాలుగు మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది అంటూ వెంకీ అట్లూరి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…