Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.ఈయన సమంత నాగచైతన్య విషయంలో చెప్పిన జోస్యం కరెక్ట్ కావడంతో ఈయన తరచూ సెలబ్రిటీల గురించి ఈ విధమైనటువంటి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలబడుతున్నారు.ఇప్పటికే ఎంతోమంది టాలీవుడ్ సెలబ్రిటీల జాతకాలు చెప్పిన తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ జాతకాల గురించి మాట్లాడారు.
గతంలో పవన్ కళ్యాణ్ జాతకం చెబుతూ ఈయనకు రాజకీయాలు అచ్చు రాలేదని రాజకీయాలలో పవన్ కళ్యాణ్ రాణించలేరని తెలిపారు. ఇకపోతే తాజాగా ఆయన వైవాహిక జీవితం గురించి వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ శ్రీజ జాతకాలు రెండు ఒకటే ఉన్నాయని తెలిపారు. వీరి జాతకంలో కుజుడు నీచంలో ఉన్నారని అందుకే వీరి జాతకంలో నాలుగు పెళ్లిళ్లు ఉన్నాయని వేణు స్వామి తెలిపారు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి మూడో వివాహాన్ని విదేశీ యువతిని చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈయన ఆమెకు కూడా విడాకులు ఇచ్చి నాలుగో వివాహం కూడా చేసుకుంటారని తెలిపారు.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ జాతకం కూడా ఇలాగే ఉందని ఆమె జాతకంలో కూడా నాలుగు పెళ్లిళ్లు ఉన్నాయని వేణు స్వామి వెల్లడించారు.
శ్రీజ ఇప్పటికి తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే కొన్ని మనస్పర్ధలు వల్ల ఆయనతో విడాకులు తీసుకున్న ఈమె తిరిగి కళ్యాణ్ దేవ్ ను వివాహం చేసుకున్నారు. అయితే గత కొంత కాలం నుంచి వీరిద్దరూ పలు మనస్పర్ధలు కారణంగా దూరంగా ఉన్నారని విడాకులు కూడా తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలా తన భర్తకు విడాకులు ఇచ్చిన ఈమె త్వరలోనే మూడవ వివాహానికి సిద్ధమైందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వేణు స్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…