Vijay Antony : ఒకరిని ఇష్టపడటం, ప్రేమించడం తప్పు కాదు కానీ ఆ ప్రేమ కోసం మన ప్రాణం తీసుకోవడం మనం ప్రేమించిన వాళ్ళ ప్రాణం తీయడం తప్పు. ప్రేమిస్తే ఎదుటివారు కూడా ప్రేమించే తీరాలి అన్నట్లుగా కొంతమంది మరీ సైకోలుగా మారిపోతున్న రోజులివి. ప్రేమించలేదని అమ్మాయి మీద యాసిడ్ పోయాడం లేదా చంపేయడం ఇలాంటి ఘటనలు అడపాదడపా వింటూనే ఉన్నాం. మరోసారి అలాంటి ఘటన తమిళనాడులో పునరావృతం అయింది. ప్రేమించలేదని అమ్మాయిని రైలు కిందకు తోసి చంపేశాడు ఒక ప్రేమోన్మాది. ఇక వాడికీ అదే శిక్ష వేయాలని హీరో విజయ్ ఆంటోనీ పోస్ట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది.

కదిలే రైలు కిందకు తోసి చంపిన ప్రేమోన్మాది… అతనికీ అదే శిక్ష వేయండి…
తమిళనాడు చెన్నై కి చెందిన సత్య ఏటి నగర్ లో ఉంటూ బికామ్ రెండో సంవత్సరం చదువుతోంది. కొద్ది రోజులుగా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటూ సతీష్ అనే వ్యక్తి వెంట పడుతుండేవాడు. వద్దని వారించినా వినలేదు. ఇక సతీష్ తల్లిదండ్రుల వరకు విషయం వెళ్లినా లాభం లేకుండా పోయింది. ఇక గురువారం మధ్యాహ్నం కాలేజ్ కి వెళ్లాలని సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. సత్యను మాట్లాడడానికి సతీష్ కూడా రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు.

சத்யாவை கொன்று சத்யாவின் அப்பாவின் தற்கொலைக்கு காரணமான சதிஷை, பொறுமையாக விசாரித்து 10 வருஷத்துக்கு அப்புறம் தூக்குல போடாமல், தயவு செய்து, உடனே விசாரித்து, ரயில்ல தள்ளி விட்டு தண்டிக்கும் படி, சத்யாவின் சார்பாக பொது மக்களில் ஒருவனாக, கனம் நீதிபதி அவர்களை கெஞ்சி கேட்டு கொள்கிறேன்???? pic.twitter.com/b8h5CPb4hg
— vijayantony (@vijayantony) October 14, 2022
ఇక అక్కడ ప్రేమించమని బలవంతం చేయడంతో సత్య నిరాకరించడంతో పక్కన ట్రాక్ మీదకు రైలు వస్తుండగా తోసేసాడు. దీంతో కదిలే రైలు కింద పడటంతో తల ముక్కలై అక్కడికక్కడే మరణించింది. ఇక ఈ విషయం తెలిసిన సత్య తండ్రి కూడా వార్త వినగానే మరణించారు. ఈ సంఘటన తమిళనాడు లో సంచలనంగా మారింది. ఇక ఈ ఇష్యూ మీద తమిళ హీరో విజయ్ ఆంటోనీ కూడా స్పందించారు. సత్య ఎలా మరణించిందో అలానే సతీష్ ను కూడా రైలు కిందకు తోసి చంపేయాలని సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. శిక్షించడానికి ఏళ్లకేళ్ళు తీసుకుని జైలులో పెట్టకుండా వెంటనే శిక్షించండి అంటూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ బాగా వైరల్ అయింది.




























