Vijay Devarakonda: పూరి జగన్నాధ్ సినిమా కోసం ఒంటిపై నూలుపోగు లేకుండా విజయ్ దేవరకొండ.. వైరల్ ఫోటో!
Vijay Devarakonda:రౌడీ హీరో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా లైగర్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఇక ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కడంతో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ సందడి చేయనున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈమె ఈ సినిమాతో మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు.
ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమా నుంచి తాజాగా విజయ్ దేవరకొండకు సంబంధించిన ఒక పోస్టర్ విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ ఒంటి పై ఒక్క నూలు పోగు లేకుండా ఉంది.ఇక ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది ఈ పోస్టర్ చూసి అమీర్ ఖాన్ పీకే సినిమాలో పోస్టర్ ను తలపిస్తోంది అంటూ చాలామంది ఈ పోస్టర్ పై కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఫోటోని విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ సినిమా కోసం శారీరకంగా మానసికంగా యాక్టింగ్ లో నా సర్వస్వం పెట్టాను. ఇది నా కెరియర్లో మోస్ట్ చాలెంజింగ్ రోల్ అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా విజయ్ దేవరకొండ సెంటిమెంట్ డే ఆగస్టు 25వ తేదీ విడుదల కానుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…