Categories: FeaturedMovie News

Vijay Devarakonda: 60 ఏళ్ళు వచ్చిన ఈ ప్రేమను మర్చిపోలేను.. 25వ తేదీ ఇండియాని షేక్ చేద్దాం: విజయ్ దేవరకొండ

Vijay Devarakonda:విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం లైగర్.ఈ సినిమా విడుదలకు మరో రెండు రోజులు మాత్రమే ఉండడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గుంటూరులో ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంది.

ఈ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు 60 సంవత్సరాలు వచ్చి సినిమాలు మానేసి ఇంట్లో కూర్చున్న ఈ 20 రోజుల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని ఎమోషనల్ అయ్యారు. లైగర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా 20 రోజులు దేశంలోని పలు రాష్ట్రాలలో పర్యటించాము. ఎక్కడికి వెళ్లిన పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఎంతో ప్రేమతో తనని ఆదరిస్తున్నారని తెలిపారు.

ఈ 20 రోజులలో చూపించిన ప్రేమను తాను 60 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ మర్చిపోలేనని ఈ సందర్భంగా ఈయన ఎమోషనల్ అయ్యారు. తనపై ఇంత ప్రేమను కురిపించిన అభిమానులకు తాను తప్పకుండా తిరిగి బహుమతి ఇవ్వాలని, గత మూడు సంవత్సరాల నుంచి లైగర్ సినిమా కోసం తాను కష్టపడుతున్నాను ఈ సినిమాని మీ ప్రేమకు కానుకగా నేను ఇస్తున్నాను.

Vijay Devarakonda: విజయ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం…

ఆగస్టు 25వ తేదీ ఈ సినిమాతో ఇండియాని షేక్ చేయాలి అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కాబోతుంది మరి ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా అంతకుమించి ఉంటుందా అనే విషయం తెలియాల్సి ఉంది.ఈ సినిమా ఇటు పూరి జగన్నాథ్ కెరియర్ లోను అలాగే విజయ్ దేవరకొండ కెరియర్ లోను భారీ బడ్జెట్ చిత్రం కావడం విశేషం. ఇక ఈ సినిమాతో అనన్య పాండే హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago