Movie News

Vijay Devarakonda: కామెంట్ చేస్తేనే పరీక్షకు చదువుతాం.. విజయ్ ను బ్లాక్ మెయిల్ చేసిన స్టూడెంట్స్?

Vijay Devarakonda: సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు ఎంతో మంది అభిమానులు ఉంటారు ఇలా తమ హీరోలతో కలిసి ఒక ఫోటో దిగడం లేదా వీరు చేసే పోస్టులకు హీరో కామెంట్స్ చేయడం చేస్తే చాలు అభిమానులు సంతోషపడుతుంటారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో నటుడు విజయ్ దేవరకొండ ఒకరు. ఈయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

ముఖ్యంగా విజయ్ దేవరకొండకు లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందనే సంగతి మనకు తెలిసిందే. ఇలా విజయ్ దేవరకొండపై ఉన్నటువంటి అభిమానంతో ఇద్దరు కాలేజీ అమ్మాయిలు చేసిన పని చూస్తే మాత్రం అందరూ షాక్ అవ్వాల్సిందే. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ ఈ వీడియోకి విజయ్ దేవరకొండ కామెంట్ చేస్తేనే తాము పరీక్షలకు చదువుతాము అంటూ విజయ్ దేవరకొండను ట్యాగ్ చేశారు.

ఇక ఈ వీడియో పై ఎంతోమంది నెటిజన్స్ ఈ వీడియోకి విజయ్ దేవరకొండ రియాక్ట్ అవడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు కానీ ఈ వీడియో చివరికి విజయ్ దేవరకొండ కంటపడటంతో ఆయన ఈ వీడియో పై కామెంట్ చేశారు. మీరు కనుక 90% మార్క్స్ తెచ్చుకుంటే ఏకంగా మిమ్మల్ని కలుస్తానని విజయ్ దేవరకొండ కామెంట్ చేశారు.

24 గంటలు లైగర్ చూపించాలి..

ఇక ఈ కామెంట్లపై ఎంతోమంది నెటిజన్స్ స్పందించారు. వాళ్లు కనుక ఫెయిల్ అయితే మేము వచ్చి కలుస్తాము అంటూ కొందరు నెగిటివ్ కామెంట్లు చేయగా మరికొందరు ఫెయిల్ అయితే కనుక 24 గంటలు కంటిన్యూగా లైగర్ సినిమా చూపించాలి అంటూ మరికొందరు ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా విజయ్ దేవరకొండను బ్లాక్మెయిల్ చేయడం అంటేనే ఆయన పట్ల ఎంత అభిమానం ఉందో అర్థమవుతుంది.

https://www.instagram.com/reel/C3W2dtgpJoe/?utm_source=ig_embed&ig_rid=8aecd88a-ecbb-4663-84a5-705ec996b005

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago