టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండపై సంచలన వ్యాఖ్యలు చేసారు నిర్మాత అభిషేక్ నామా. 100కి పైగా చిత్రాలకు డిస్ట్రిబ్యూట్ చేసి, ఆ తరువాత నిర్మాతగా గూడాచారి, కేశవ, సాక్ష్యం, బాబు బాగా బిజీ వంటి చిత్రాలకు నిర్మించిన నిర్మాత అభిషేక్ నామ మాట్లాడుతూ..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు సపోర్ట్ బాగానే ఉంది, టాలీవుడ్ పెద్దలు అందరూ నన్ను బాగానే ప్రోత్సహిస్తున్నారు. కానీ నా కెరీర్ లో నన్ను బాగా ఇబ్బందికి గురిచేసిన సంఘటన “వరల్డ్ ఫేమస్ లవర్” సినిమా ఫ్లాప్.. ఆ సిఎమా ప్లాప్ అవడంతో చాలా బాధపడ్డాను. పెట్టిన పెట్టుబడుల్లో 10 శాతం కూడా రాలేదు. తీవ్రమైన నష్టాన్ని మిగిల్చింది ఆ సినిమా. అటు విజయ్ దేవరకొండ, కెఎస్ రామారావు గారి సినిమా ఇంత భారీ నష్టం వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆ సినిమా ఫ్లాప్ అయిన తరువాత హీరో విజయ్ దేవరకొండ నుంచి అస్సలు ఎటువంటి స్పందన రాలేదు.
విజయ్ దేవరకొండకు అస్సలు రెస్పాన్సిబిలిటీ లేదు. పెట్టిన డబ్బులు పోయినందుకు అయన కాస్త అయిన రెస్పాండ్ అయివుంటే చాలా సంతోషించేవాళ్ళం. సక్సెస్ వస్తే హ్యాపీనెస్ పంచుకుంటారు. అదే సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటారు. ఇలా చేస్తే రేపటి రోజున మరో సినిమా చేయగలమా? వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకి నేను ఒక్కడినే కాదు చాలా మంది బయ్యర్లు నష్టపోయారు. నేను ఎదుగుతా.. మీరు పొతే పొండి అని అనటం సరైనది కాదు. విజయ్ దేవరకొండ నుంచి కొంచెం మోరల్ సపోర్ట్ కోరుకున్నా.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు అభిషేక్ నామ.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…