Vijay Varma: బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ గురించి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొంతకాలం క్రితం వరకు విజయవర్మ అంటే ఎవ్వరికీ తెలియదు. కానీ తమన్నాతో చట్టా పట్టాలేసుకొని తిరగటం వల్ల ఇద్దరు ప్రేమలో ఉన్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తల వల్ల అటు నార్త్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా విజయ్ వర్మ గురించి అందరికీ తెలిసిపోయింది.
చాలా కాలంగా తమన్న విజయవర్మ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. వీరిద్దరూ కూడా ఈ వార్తలను ఖండించినప్పటికీ వాటికి మాత్రం బ్రేక్ పడలేదు. అంతేకాకుండా తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా విజయవర్మ చేసిన పని అందరిని షాక్ కి గురి చేసింది. ఒకవైపు తమన్నాతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న తరుణంలో వధువు కావలెను అంటూ విజయ వర్మ పేపర్లో ప్రకటన ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
మరొకవైపు ఈ ప్రకటన చూసి విజయ్ వర్మ తల్లి కూడా తలపట్టుకుంది. అసలు విషయం ఏమిటంటే… విజయ్ వర్మ ప్రధాన పాత్రలో నటించిన దహాద్ వెబ్ సిరీస్ మే 12 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా పేపర్లో ఇలా ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటనలో ఇండియాలోనే నెంబర్ వన్ బ్యాచిలర్ అంటూ విజయ్ వర్మ ఫోటో వేయటమే కాకుండా కింద వధువు కావలెను అంటూ అతని డీటెయిల్స్ కూడా ఉన్నాయి.
ఈ ప్రకటన చూసి విజయ వర్మ తల్లి ఒక్కసారిగా తల పట్టుకుంది. ఇక తన తల్లి ఫోటోలను విజయవర్మ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు. అంతే కాకుండా ఈ విషయం తన తల్లికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ వర్మ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో నేటిజెన్లు కూడా వివిధ రకాలుగా స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. తమన్నా ఉండగా మరొక వధువు ఎందుకు వెంటనే వెళ్లి అమ్మకు చెప్పు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…