Vijaya Shanthi : అమ్మ, నాన్న, అన్న చిన్నప్పుడే చనిపోయారు… నా పెళ్లి నేనే చేసుకున్న… విజయశాంతి పిన్ని ఎవరంటే…!

Vijaya Shanthi : సినిమాల్లో అగ్ర హీరోయిన్ గా అందరు హీరోలతో నటించి లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయ శాంతి సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తనకంటూ మంచి గుర్తింపు అందుకుంది. తెలంగాణ సెపరేట్ రాష్ట్రంగా అవతరించాలన్న ఆశయంతో తల్లి తెలంగాణ పార్టీ పెట్టి పోరాడారు. రాజకీయ ఓనమాలు బీజేపీ లో నేర్చుకున్నా ఆపైన సొంత పార్టీ పెట్టి పరిస్థుల ప్రభావం వల్ల పార్టీని తెరాస లో విలీనం చేసి అటు మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్లి చివరకు బీజేపీలో కొనసాగుతున్న రాములమ్మ తన రాజకీయా ప్రస్థానం అలాగే సినిమాల గురించి ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు…

విజయశాంతి గారు అతి చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. ఆమె తన పిన్ని విజయలలిత సినిమా ఇండస్ట్రీలో ఉండటంతో అలానే తండ్రి శ్రీనివాసరావు కు ఇండస్ట్రీ వైపు వెళ్లాలానే ఆసక్తి ఉండటం వల్ల విజయశాంతి గారు బాల నటిగా ఇండస్ట్రీ వైపు అడుగులేసారు. ఇక విజయలలిత గారు ఎన్నో సినిమాల్లో శృంగార నర్తకిగా చేసినా మరెన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించారు, అలాగే నిర్మాతగా కూడా సినిమాలను తీశారు. ఇక విజయశాంతి గారు చిన్నప్పటి నుండి ఇండిపెండెంట్ గా ఉండటం అలవాటు అంటూ చెప్తారు.

తల్లిదండ్రులు ఇద్దరూ 15 ఏళ్ల వయసులో మరణించడంతో తన బాధ్యత తానే చూసుకున్నట్లు చెప్తారు విజయశాంతి. తండ్రి గుండెపోటుతో మరణించిన ఏడాదికే తల్లి కూడా ఆయన మీద బెంగతో మరణించారట. ఇక అన్న కూడా ఆ తరువాత మరణించడంతో విజయశాంతి ఒంటరివారైయ్యారు. తన పెళ్లి కూడా తానే చేసుకున్నట్లు విజయశాంతి చెబుతారు. కాకపోతే తల్లిదండ్రుల విషయంలో లోటు ఉన్నా భర్త, కెరీర్ పరంగా సక్సెస్ అలానే రాజకీయంగా సాధించవలసినవి చేయగలిగానంటూ చెప్పారు విజయశాంతి.