Vijaya Shanti : దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ సినీ రంగాన్ని ఏలిన హీరోయిన్, అగ్రనటులతో అనేక సినిమాలలో నటించి తనకంటూ సినీ పరిశ్రమలో ఒక సుస్థిర స్థానాన్ని విజయశాంతి ఏర్పరచుకున్నారు. 1990 మొదటి అర్థ భాగంలో తన సినీ పరంపరను ముగించుకొని, ఆమె 1998లో రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె మొదట భారతీయ జనతా పార్టీలో చేరింది. తెలంగాణ రాష్ట్ర సాధన లక్షంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసింది. అనంతరం ఆ పార్టీని 2009లో తెలంగాణ రాష్ట్ర సమితి లో విలీనం చేసి టీఆర్ఎస్ లో చేరింది. ఆమె 2009లో మెదక్ పార్లమెంట్ స్థానం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచింది.
విజయశాంతి ని 2013లో పార్టీవ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటుందని ఆమెను టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆమె 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. విజయశాంతి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యింది. ఆమె 07 డిసెంబర్ 2020న భారతీయ జనతాపార్టీలో చేరింది. అయితే విజయశాంతి ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఆంధ్ర తెలంగాణ లోని మీ ప్రత్యర్ధులు మీ నేటివ్ ప్లేస్ గురించి తరచూ విమర్శలు చేస్తున్నారు. మరొకసారి మీ నేటివ్ ప్లేస్ గురించి చెప్తారా? అని అడగగా విజయశాంతి స్పందిస్తూ..
మా తాత గారిది వరంగల్, ఏటూరు నాగారం రామన్నగూడెం.. తెలంగాణ ప్రాంతాన్ని నిజాం పరిపాలిస్తున్న సమయంలో వారి దోపిడీ దొంగతనాలకు వ్యతిరేకంగా మా తాత పోరాడడంతో ఆ విషయాన్ని తెలుసుకున్న నిజాం మా తాత మరియు మా కుటుంబం పైన పగ తీర్చుకోవాలని అనుకున్నారు. ఆ క్రమంలో మా కుటుంబాన్ని లేపేయమని రజాకార్లను పంపించారు. ముందుగానే ఆ విషయం పసిగట్టిన మా తాత తన ముగ్గురు కూతుర్లను ఒక కొడుకుని తీసుకొని మద్రాస్ పారిపోయారు. అక్కడే మేము పెరిగి పెద్దయ్యాం.
అలాగే మీరు ఏ దైవాన్ని ఇష్టపడతారు అన్న ప్రశ్నకు సమాధానంగా.. నాకు శివుడు అంటే ఆరాధ్య దైవం.. ఆయనే నన్ను ఇంకా కాపాడుతున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మూడు నాలుగు సార్లు ప్రమాదాలు తప్పిపోయాయని ఆ శివుడి కృప లేకుంటే నేను చనిపోయేదాన్నేమో, ఒకసారి సినీనటులకు విమాన ప్రమాదం జరిగినప్పుడు నేను అందులోనే ఉన్నాను.. ఆ ప్రమాదం జరిగే ఐదు నిమిషాల ముందు నా లైఫ్ కి ప్యాకప్ చెప్పే సమయం వచ్చింది అనుకున్నాను. కట్ చేస్తే విమాన ప్రమాదం జరిగింది. కానీ ఆ ప్రమాదంలో నుంచి నేను బయటపడ్డాను.
అలాగే ఒక సినిమా షూటింగ్ సమయంలో నదిలో ఒక సీన్ చేస్తుండగా అందులో కొట్టుకపోయాను అప్పుడు కూడా బతికి బయటపడ్డాను. అలాగే “సాహస బాలుడు విచిత్ర కోతి” చిత్రం క్లైమాక్స్ సీన్ లో ఒకపక్క ఒళ్ళు కాలిపోతుంది. మరోపక్క నా కాలు విరిగిపోయింది. ఇప్పటికీ ఆ విషయం ఎవరికీ తెలియదు. అయినా కట్టుకట్టుకొని, నొప్పిని భరిస్తూ.. ఆ సినిమా షూటింగ్ లో పాల్గొని, పోరాట సన్నివేశాలను పూర్తి చేశాను అని గత స్మృతులను విజయశాంతి ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…