Balakrishna : నందమూరి నటసింహం బాలయ్యబాబు ఎన్టీఆర్ వారసుడు గా సినిమాల్లోకి వచ్చి తనకంటూ సొంత గుర్తింపుతో టాప్ హీరోగా ఎదిగాడు. పౌరాణికమైనా, జానపదమైనా ఏదైనా తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్న బాలయ్యకు తండ్రి మీద ఎనలేని ప్రేమ. ఏ పని మొదలు పెట్టాలన్నా తండ్రి ఎన్టీఆర్ ను తలుచుకునే బాలకృష్ణ ఏ పనైనా మొదలుపెడుతారు. ఇక ఎన్టీఆర్ గారు ఎలా క్రమశిక్షణతో సెట్స్ లో ఉండేవారో అలానే బాలయ్య కూడా సెట్స్ లో క్రమశిక్షణతో ఉంటారు.
రోజూ రాత్రికి ఆ పని చేసే నిద్రపోతాడు…
ఇక సీనియర్ నటుడు మురళీ మోహన్, బాలకృష్ణ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో చెబుతూ ఏ సినిమా అయినా, షో అయినా తండ్రి ఎన్టీఆర్ ని తలుచుకుని మొదలుపెడతారు. అలాగే రోజూ రాత్రి పడుకునే ముందు ఎన్టీఆర్ గారి సినిమా చూసి, పాటలు విని పడుకోవడం బాలకృష్ణకు దినచర్య. సాధారణంగా ఇప్పటి తరం హీరోలు ఎవరైనా తాను ఆ సినిమాలో అలా చేశాను, ఈ సినిమాలో ఇలా చేశాను అంటూ వాళ్ల గురించి ఎక్కువ చెప్పుకుంటారు, కానీ బాలయ్య మాత్రం పదే పదే తండ్రి సినిమాలు, పాత్రలే గుర్తు చేసుకుంటారని మురళీ మోహన్ తెలిపారు.
ఇప్పటికీ ఆ అలవాటు మానుకోలేదు. ఇక షూటింగ్ సెట్స్ లో కూడా తండ్రి గురించి తన తోటి నటీ నటులకు చెబుతూ ఉంటారు. ఉత్తరాది నటులకు, హీరోయిన్లకు ఎన్టీఆర్ సినిమాల గురించి, క్రమశిక్షణ గురించి చెప్తూనే ఉంటారు. ఆయన మధురస్మృతులను గుర్తుచేసుకుంటూనే ఉంటారు అంటూ బాలకృష్ణకు తన తండ్రి అంటే ఎంత ఇష్టం అనే విషయాన్ని చెప్పారు మురళీ మోహన్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…