Vijayalakshmi : సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన విజయలక్ష్మి తల్లిదండ్రులు కూడా గాయకులే. ఇక విజయలక్ష్మి కూడా కర్ణాటక సంగీతం నేర్చుకుంది అలాగే హిందూస్థాని సంగీతం కూడా నేర్చుకుంది. 25 సంవత్సరాలనుండి దాదాపు ఎన్నో వేల పాటలు పాడిన విజయలక్ష్మి దేవదాస్ సినిమాలోని ‘మాయదారి చిన్నోడా’ పాటతో బాగా పాపులర్ అయ్యారు.
చక్రి గారు ఉండుంటే కెరీర్ వేరేలా ఉండేది….
ఇక విజయలక్ష్మి పలు ఈవెంట్లలో పాల్గొంటూ పాటలు పాడి అలరిస్తున్నారు. ఇక తాజాగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన సంగీత ప్రయాణాన్ని గురించి పంచుకుంటూంటారు. తాజాగా చక్రి గారి గురించి మాట్లాడారు. చక్రి గారి సంగీత దర్శకత్వంలో దాదాపు తొమ్మిది సినిమాలలో పాటలు పాడానని ఆయన సంగీత దర్శకత్వంలోని దేవదాస్ సినిమాలోని మాయదారి చిన్నోడు అనే పాట ద్వారా మంచి గుర్తింపు వచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఇపుడు చక్రి గారు బ్రతికుంటే నా కెరీర్ ఇంకోలా ఉండేదని, నాదే కాకుండా తెలుగు నేపధ్య గాయకులకు అవకాశాలు వచ్చేవని, ఆయన సాధ్యమైనంత వరకు మన వాళ్ళతో పాడిస్తారని చాలా అరుదుగా ఇతర భాషల వారితో పాడిస్తారని చెప్పింది.
ఇక సింగర్ సునీత తనకు దూరపు బంధువు అవుతుందని ఆవిడతో ఎలాంటి విబేధాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఒక సింగర్ రెమ్యూనరేషన్ గురించి చాలా వరకు డిమాండ్ చేయరని, ఆ ఒక సినిమాలో పాట హిట్ అయితే ఎన్నో ఈవెంట్స్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు కాబట్టి డిమాండ్ చేయరని చెప్పుకొచ్చారు. ఇక అసోసియేషన్ లో ఎలాంటి అవకతవకలు లేవని చిత్రపురి కాలనీలో సీనియర్ గాయకులకు కూడా ఇల్లు మంజూరు చేయలేదని వాఖ్యణించారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…