Vijayashanthi : లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకుని లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే ఆ హీరోయినే కరెక్ట్ అనేంతగా డైరెక్టర్లు నమ్మిన హీరోయిన్ విజయశాంతి. చేసిన ఏ సినిమాలో అయినా హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్. అప్పట్లో అటు కృష్ణ, శోభన్ బాబు లాంటి పెద్ద హీరోలతో నటించి, చిరు, బాలయ్య, నాగార్జున వంటి యువతరం హీరోలతోను హిట్లు కొట్టిన హీరోయిన్. ఇక మరో వైపు కర్తవ్యం, ప్రతి ఘటన, ఒసేయ్ రాములమ్మ వంటి సినిమాలతో మెప్పించింది.

ఇక కర్తవ్యం సినిమాకి నేషనల్ అవార్డు అందుకుంది. ఇక ప్రతిఘటన సినిమా కి నంది అవార్డు అందుకుంది. ఇలా ఎన్నో అవార్డులు తన వద్దకు వచ్చేలా నటించిన విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత సినిమాల్లో నటించలేదు. మళ్ళీ చాలా ఏళ్ల తరువాత మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించింది.

చిరు తో అందుకే 20 ఏళ్ళు మాట్లాడలేదు….

విజయశాంతి గ్లామర్ పాత్రలలో కూడా అంతే మెప్పించారు. హీరోలతో సమానంగా డాన్స్ వేసి అభిమానులను పెంచుకున్నారు. 90 లలో చిరు విజయశాంతి కాంబినేషన్ అంటే హిట్ పెయిర్ అనే పేరుండేది. దాదాపుగా 19 సినిమాలను చిరంజీవికి జంటగా నటించింది. ఇక బాలకృష్ణ తో కూడా 17 సినిమాలు దాదాపుగా చేసి హిట్ పెయిర్ గా నిలిచారు. స్వయం కృషి, పడమటి సంధ్యారాగం వంటి విభిన్న సినిమాలతో పాటు ఒసేయ్ రాములమ్మ, ప్రతి ఘటన వంటి విభిన్నమైన చిత్రాలతో అలరించిన విజయ శాంతి లేడీ సూపర్ స్టార్ అయింది. చిరు, విజయశాంతి పెయిర్ అనగానే హిట్ పెయిర్ అనే ముద్ర పడిపోయింది. ఆన్ స్క్రీన్ లో వారి మధ్య కెమిస్ట్రీ అంత అందంగా కుదిరింది.

బయట కూడా ఇద్దరు మంచి మిత్రులుగా ఉండేవారు. అలాంటిది విజయశాంతి, చిరంజీవి ఆ తరువాత 20 ఏళ్ళు మాట్లాడుకోలేదు. ఈ విషయం పై విజయ శాంతి స్పందిస్తూ ఒకసారి రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత ప్రత్యర్థులుగా ఉన్నాక విభేదాలు వస్తాయని, తెలంగాణ ఉద్యమం సమయంలో ఎంతోమంది చనిపోయినపుడు సినిమా పరిశ్రమ నుండి మద్దతు ఇవ్వమని అడిగితే సినిమా పరిశ్రమ నుండి ఎవరు స్పందించలేదు. సహాయం చేయకపోయినా స్పందించి ఉంటే బాగుండేదని అనిపించింది ఇక అప్పటి నుండి మాట్లాడలేదని వివరించారు.































