Vijayendra Prasad: రచయితగా ఎన్నో సినిమాలకు కథలను అందించి ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన రచయితగా తెరకెక్కిన బాహుబలి త్రిబుల్ ఆర్ భజరంగి బాయిజన్ వంటి సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చాయి. ఇక 80 సంవత్సరాల వయసులో కూడా విజయేంద్ర ప్రసాద్ ఎంతో చురుగ్గా ఉంటూ అద్భుతమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
ఇకపోతే ఈయన సినిమా ఇండస్ట్రీలో అందించిన సేవలకు గాను ఈయనకు రాష్ట్రపతి కోటాలో ఏకంగా రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈయన రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేయబోతున్న సినిమాకి కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాతో పాటు రజాకార్ల నేపథ్యంలో తెరకెక్కబోయే సినిమాకి కూడా ఈయన కథ సిద్ధం చేస్తున్నారు.
ఇకపోతే ఇదివరకే రజాకార్ల నేపథ్యంలో ఓ సినిమా చేయాలని ఇదివరకే ఎంతోమంది దర్శక నిర్మాతలు ప్రయత్నం చేసినప్పటికీ ఈ సినిమా ముందుకు సాగలేదు.ఈ సినిమా చేయాలని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సైతం ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో సినిమా చేయడం కోసం విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారని ఆయనే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి.
ఇలా తన గురించి వస్తున్న ఈ వార్తలపై విజయేంద్ర ప్రసాద్ స్పందిస్తూ తాను ఈ సినిమాకి దర్శకత్వం వహించలేదని కేవలం కథ మాత్రమే అందిస్తున్నానని తెలిపారు. ఇకపోతే ఈ సినిమాని ఎవరు తీస్తున్నారు ఏమిటి అనే విషయాలను త్వరలోనే వెల్లడిస్తారని ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇకపోతే ఈ సినిమా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండబోతుందని ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కన్నీళ్లతో బయటకు వస్తారని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…