Villain Ponnambalam: విలన్ గా, స్టంట్ మాస్టర్ గా వందల సినిమాల్లో నటించిన నటుడు పొన్నాంబలం. తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటించిన పొన్నాంబలం తెలుగులో ఘరానా మొగుడు, హిట్లర్, మెకానిక్ అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు, చూసొద్దాం రండి, నువ్వొస్తావని వంటి సినిమాల్లో విలన్ గా నటించారు. ఎన్నో సినిమాల్లో నటిస్తూనే అటు రాజకీయాల్లోను క్రియాశీలకంగా ఉన్న పొన్నాంబలం ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చిన్న గదిలో ఉండేవారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి ప్రస్తుతం పలు సినిమా అవకాశాలను అందుకుంటున్నారు.
చిరంజీవి రూపంలో దేవుడు కనిపించాడు…
సొంతవాళ్లే స్లో పాయిజన్ ఇవ్వడంతో అనారోగ్యం పాలైన పొన్నాంబలం గారు ఆర్థికంగానూ చితికిపోయారు. గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆయనకు అసలు విషయం తెలిసి షాక్ అయ్యారట. ఇక తన కిడ్ని పాడై పోయి డైయాలసిస్ చేయాల్సిన పరిస్థితికి వచ్చేయడంతో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ట్రీట్మెంట్ కి అయ్యే డబ్బు తనతో లేకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో చిరంజీవి గారికి విషయం తెలిసి ఆయన ఫోన్ చేసి విషయం అడిగి ఐదు నిమిషాల్లో ఫోన్ చేస్తా అని చెప్పారట.
ఆ పైన మెగాస్టార్ కోడలు ఉపాసన ఫోన్ చేసి స్వయంగా ఆమె మాట్లాడి అపోలో హాస్పిటల్ కి రమ్మని చెప్పారట. అక్కడికి వెళ్ళాక డైయాలసిస్ చేస్తారని అనుకున్నారట పొన్నాంబలం. అయితే కిడ్నీ మార్పిడి చికిత్స కోసం ఆయనకు టెస్టులు నిర్వహించారట. ఉపాసన గారు ఫోన్లో మాట్లాడినపుడు నేను రామ్ చరణ్ భార్యను మావయ్య మీ గురించి చెప్పారు అంటూ చెప్పగానే షాక్ అయ్యాను. అంత పెద్ధ కుటుంబం నాకోసం కాల్ చేసారా అనిపించింది. నేడు చిరంజీవి గారి వల్లే బ్రతికి ఉన్నాను అంటూ పొన్నాంబలం ఎమోషనల్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…