సాధారణంగా కొందరు వ్యక్తులు ఎంతో ఎత్తు నుంచి బంగీ జంప్ చేయడం, గాల్లో చిన్నపాటి తాడుపై నడుస్తూ వెళ్లడం, వంటి అద్భుతమైన సాహస విన్యాసాలను చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటారు. కానీ ఇటువంటి సాహసాలను నిపుణుల పర్యవేక్షణలో చేయడం వల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్త పడవచ్చు. అంతేకాకుండా ఇలాంటి సాహసాలను ప్రదర్శించడానికి ఎంతో అనుభవం కూడా కలిగి ఉండాలి. ఇలాంటి స్టంట్ లు చేసేటప్పుడు ఏ మాత్రం పొరపాటు జరిగినా ప్రాణాలను కోల్పోవలసి వస్తుంది. ఇలాంటి తరహా వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తాజా చాలెంజ్ ఇది. ఈ చాలెంజ్ ప్రకారం ఒక వ్యక్తి ఇద్దరు యువతులను ఎత్తుకొని నీటిలో దూకాలి. ఈ ఛాలెంజ్ లో భాగంగానే ఒక వ్యక్తి ఇద్దరు యువతులను తన నడుము పై ఎక్కించుకుని చాలా ఎత్తు నుంచి నీటితో నిండి ఉన్న ఒక క్వారీలో దూకాడు. అతడు ఈ సాహసం చేసేటప్పుడు ఏమాత్రం తేడా జరిగినా వారి ముగ్గురు ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. కానీ వారి అదృష్టం బాగుండి వారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా బయట పడ్డారు.
ఈ స్టంట్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఈ వీడియోపై తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు.ఎంతో సాహసంతో కూడుకున్న ఈ స్టంట్ ఎంతో ప్రమాదకరమైనదని భావించారు. కానీ ఇలాంటి స్టంట్ లు కేవలం నిపుణుల పర్యవేక్షణలో చేస్తేనే మంచిదని కొందరు భావించగా.. మరికొందరు ఇలాంటి డేంజర్ స్టంట్ లను ఎవరు ప్రయత్నించవద్దని తెలియజేస్తున్నారు. ఏమాత్రం అనుభవం లేని వారు ఇలాంటి సాహసాలు చూసి ప్రయత్నిస్తే అది వారి ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…