హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి పండుగ రోజున పిల్లల నుంచి పెద్దల వరకు బాణసంచా కాల్చి గ్రాండ్ గా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల ఈ సంవత్సరం పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గతంలో శివకాశి పేరు వినిపిస్తే బాణసంచా హబ్ అని చెప్పేవాళ్లు. కానీ అక్కడ ప్రస్తుతం దీపావళి పండుగ జోష్ అస్సలు కనిపించడం లేదు.
శివకాశిలోని ప్రతి కుటుంబానికి బాణసంచాతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉంది. అనేక రాష్ట్రాలు బాణసంచాపై బ్యాన్ విధించిన నేపథ్యంలో శివకాశి కళ కోల్పోయింది. దీపావళి పండుగ సమయంలో అమ్మే బాణసంచాపై ఆధారపడి అక్కడి కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. పురుషులు, మహిళలు అనే తేడాల్లేకుండా అందరూ బాణసంచా పరిశ్రమల్లో పని చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు.
బాణసంచా తయారీ పరిశ్రమలో పని చేయడం వల్ల కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో పాటు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలే కోల్పోయే అవకాశం ఉంది. బాణసంచా అమ్మకాలు ఆగిపోతే తన జీవితాలు తలక్రిందులు అవుతాయని.. ఉపాధి కోల్పోతే బ్రతికే పరిస్థితి లేదని బాణసంచా తయారీదారులు చెబుతున్నారు. నిషేధం విధించి మా పొట్ట కొట్టొద్దు సార్లూ అని వేడుకుంటున్నారు.
ఇప్పటికే కరోనా వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని గతంతో పోలిస్తే 45 శాతం వరకు బాణసంచా ఉత్పత్తి తగ్గిందని ఇలాంటి సమయంలో నిషేధం విధించడం ద్వారా తాము మరింత నష్టపోతామని బాణసంచా విక్రయదారులు రోదిస్తూ ఉండటం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…