కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కరోనా, లాక్ డౌన్ వల్ల ఉద్యోగం కోల్పోయిన నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతోంది. తాజాగా మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గర్ యోజన స్కీమ్ ను ప్రకటించింది. ఆత్మనిర్భర్ 3.0లో భాగంగా కేంద్రం ఈ కొత్త స్కీమ్ ను ప్రకటించడం గమనార్హం. దేశంలోని ఉపాధి కల్పనను పెంచేందుకు కేంద్రం ఈ స్కీమ్ ను తెచ్చింది.
ఈపీఎఫ్‌వోలో రిజిస్టర్ అయిన ప్రతి కంపెనీ ఆత్మ నిర్భర్ భారత్ రోజ్‌గర్ యోజన స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు. లాక్ డౌన్ సమయంలో ఉద్యోగం కోల్పోయిన వాళ్లకు, 2021 సంవత్సరం జూన్ 30 వరకు కొత్త ఉద్యోగాలు కల్పించినా ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. 1000లోపు ఉద్యోగులు ఉన్న సంస్థలు కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటే కేంద్రం ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగి పీఎఫ్, కంపెనీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ మొత్తం 24 శాతాన్ని చెల్లిస్తుంది.
15,000 రూపాయల లోపు వేతనం ఉన్న ఉద్యోగులు మాత్రమే ఈ ప్రయోజనాలను పొందగలరు. నిర్మలా సీతారామన్ 2022 సెప్టెంబర్ 30 వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. పన్ను చెల్లింపుదారులకు 1,32,000 కోట్ల రూపాయలు రీఫండ్ ఇచ్చామని.. 11 రాష్ట్రాలకు 3,621 కోట్ల రూపాయలు వడ్డీ రహిత రుణాలలో భాగంగా ఇచ్చామని వెల్లడించారు.
కేంద్రం కరోనా, లాక్ డౌన్ వల్ల నష్టపోయిన వాళ్లకు ప్రయోజనం చేకూర్చేలా అనేక స్కీమ్ లను అమలు చేస్తోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. రైతులతో పాటు అనేక రంగాలకు ప్రయోజనం చేకూర్చేలా నిధులను విడుదల చేశామని అన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…