కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కరోనా, లాక్ డౌన్ వల్ల ఉద్యోగం కోల్పోయిన నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతోంది. తాజాగా మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గర్ యోజన స్కీమ్ ను ప్రకటించింది. ఆత్మనిర్భర్ 3.0లో భాగంగా కేంద్రం ఈ కొత్త స్కీమ్ ను ప్రకటించడం గమనార్హం. దేశంలోని ఉపాధి కల్పనను పెంచేందుకు కేంద్రం ఈ స్కీమ్ ను తెచ్చింది.

ఈపీఎఫ్‌వో‌లో రిజిస్టర్ అయిన ప్రతి కంపెనీ ఆత్మ నిర్భర్ భారత్ రోజ్‌గర్ యోజన స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు. లాక్ డౌన్ సమయంలో ఉద్యోగం కోల్పోయిన వాళ్లకు, 2021 సంవత్సరం జూన్ 30 వరకు కొత్త ఉద్యోగాలు కల్పించినా ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. 1000లోపు ఉద్యోగులు ఉన్న సంస్థలు కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటే కేంద్రం ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగి పీఎఫ్, కంపెనీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ మొత్తం 24 శాతాన్ని చెల్లిస్తుంది.

15,000 రూపాయల లోపు వేతనం ఉన్న ఉద్యోగులు మాత్రమే ఈ ప్రయోజనాలను పొందగలరు. నిర్మలా సీతారామన్ 2022 సెప్టెంబర్ 30 వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. పన్ను చెల్లింపుదారులకు 1,32,000 కోట్ల రూపాయలు రీఫండ్ ఇచ్చామని.. 11 రాష్ట్రాలకు 3,621 కోట్ల రూపాయలు వడ్డీ రహిత రుణాలలో భాగంగా ఇచ్చామని వెల్లడించారు.

కేంద్రం కరోనా, లాక్ డౌన్ వల్ల నష్టపోయిన వాళ్లకు ప్రయోజనం చేకూర్చేలా అనేక స్కీమ్ లను అమలు చేస్తోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. రైతులతో పాటు అనేక రంగాలకు ప్రయోజనం చేకూర్చేలా నిధులను విడుదల చేశామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here