Virat Kohli -Anushka Sharma: అనుష్క శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు ఇండియాలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీస్.ఒకరు చిత్ర పరిశ్రమలో అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగా మరొకరు ఇండియన్ క్రికెటర్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు. ఇల వీరిద్దరూ కొన్ని సంవత్సరాలు పాటు ప్రేమలో ఉండి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.
ఈ విధంగా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా జన్మించారు. ఇకపోతే విరాట్ కోహ్లీ అనుష్క ఇద్దరు కూడా కోట్లు సంపాదిస్తూ ముంబైలో ఆలీబాగ్ ప్రాంతంలో కోట్లు విలువ చేసే ఫామ్ హౌస్ కొనుగోలు చేశారని తెలుస్తోంది.ఇలా ఎంతో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినప్పటికీ ఈ దంపతులు మాత్రం జుహూ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉన్నారని తెలుస్తోంది.
ముంబైలోని జుహు ప్రాంతంలో హై టైడ్ అనే బిల్డింగ్ లో నాలుగో ఫ్లోర్‌లో ఈ ఫ్లాట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాంతం నుంచి సీ వ్యూవ్ ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందట అందుకోసమే ఈ దంపతులు సొంత ఇంట్లో కాకుండా అద్దె ఇంట్లో ఉంటున్నారు.
ఇకపోతే ఈ ఇంటి కోసం ఈ దంపతులు నెలకు 2.72 లక్షల రూపాయల అద్దె చెల్లిస్తుండడం విశేషం. ఇప్పటికే ఈ ఇంటిలో అద్దెకు ఉండడం కోసం వీరి మధ్య అగ్రిమెంట్ కూడా కుదిరిందని తెలుస్తోంది. ఇక ఈ దంపతులు ఉన్న అపార్ట్మెంట్ మరెవరిదో కాదు క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ మాజీ క్రికెటర్ సమర్‌జీత్ సింగ్ గైక్వాడ్‌దే అని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…