సెలబ్రిటీ కపుల్స్ గా అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ జంటకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఎంతోమంది అభిమానులను సంపాదించగా టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ అదేస్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.స్టార్ సెలబ్రిటీ కపుల్స్ గా కొనసాగుతున్న ఈ జంట సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.
ఈ ఏడాది ఈ జంట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పటి వరకు తమ గారాలపట్టి ఫోటోలను మాత్రం ఈ జంట అభిమానులతో పంచుకోలేదు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ శనివారం ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఈ నేపథ్యంలో తన కూతురు వామికా గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.
పలువురు అభిమానులు తన కూతురు వామికా పేరుకు అర్థం ఏమిటి అని అడగగా అందుకు కోహ్లీ స్పందిస్తూ… వామికా అంటే దుర్గామాత మరొక పేరు అని వివరించారు. అదేవిధంగా మరికొందరు నెటిజన్లు మీ ముద్దుల తనయ ఫోటోలను మేము చూడవచ్చా? అని ప్రశ్నించగా అందుకు కోహ్లీ..”మా కూతురికి సోషల్ మీడియా అంటే ఏమిటి అనే అవగాహన కలిగే వరకు.. ఆమె కోరికలను వ్యక్తపరిచే గలిగే వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని” అనుష్క తను ఇద్దరూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ జంట తీసుకున్న ఈ కీలక నిర్ణయం వల్ల మనం ఇప్పుడప్పుడే వీరి గారాలపట్టిని చూడలేమని అర్థమవుతోంది. ఇకపోతే ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర పరిస్థితులలో కరోనా బాధితుల కోసం మీరు ఒక జంట రెండు కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటిస్తూ ఫండ్ రైజింగ్ కార్యక్రమం కూడా చేపడుతున్నారు.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…