Vishnu Reddy : ప్రస్తుతం ఈ వెకెండ్ కి రిలీజ్ అయిన లైగర్ సినిమా మిశ్రమ స్పందనతో వెళ్తున్న ఈ సినిమా గురించి బాగా టాక్ నడుస్తోంది. సినిమా గురించి ఒక వైపు ట్రోల్ల్స్ వినిపిస్తున్నా మరో వైపు విజయ్, రమ్యకృష్ణ సినిమాను తమ భుజాలపై మోసారంటు టాక్ వినిపిస్తోంది. ఇక ఆ సినిమాలో నెగెటివ్ షేడ్ లో కనిపించిన విష్ కి కూడా కెరీర్ కి ఆ క్యారెక్టర్ ప్లస్ అయింది. విష్ సినిమాలో నటనే కాకుండా పీసీ కనెక్ట్స్ లో కూడా పనిచేస్తున్నాడు విష్ణు రెడ్డి. మెహబూబ సినిమాలో విలన్ గా నటించిన విష్, నిజానికి విష్ణు రెడ్డి 2009 లో మిస్టర్ సౌత్ పేజెంట్ విన్నర్. ఇక సినిమాల మీద ఇంట్రస్ట్ తో నాగచైతన్య మొదటి సినిమా జోష్ లో నటించాడు. సినిమా తరువాత అసిస్టెంట్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాను ఇంకా ఇతర విభాగాలలో పనిచేసి ఇండస్ట్రీ గురించి అవగాహన తెచ్చుకోవాలని అనుకున్నాడు.
లైగర్ మొదట అల్లు అర్జున్ కోసం రెడీ చేశారా…
ఇక లవ్ బ్రేక్ అప్ వల్ల మార్షల్ ఆర్ట్స్ వైపు వెళ్లి వాటిలో శిక్షణ తీసుకుని, బ్యాంకాక్ వెళ్లి ఆరు నెలలు శిక్షణ తీసుకున్న విష్, ఇక లైగర్ సినిమా అవకాశంతో విజయ్ దేవరకొండకి ధీటుగా నెగెటివ్ పాత్రలో కనిపించాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ అందులో విజయ్, తదితరుల నటనకు మంచి మార్కులే పడ్డాయి. విష్ కి కూడా బాలీవుడ్ అవకాశాలు తలుపు తడుతున్నాయి. అయితే సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ ఇపుడు బాగా వినిపిస్తోంది. అదే లీగర్ సినిమా మొదట అనుకున్నది అల్లు అర్జున్ కోసం అని మరి అది నిజమో కాదో లైగర్ విలన్ క్లారిటీ ఇచ్చాడు. ఇక సినిమాలో విజయ్ ఒక బాక్సర్ గా చాలా బాగా కనిపించాడు, ఇందుకోసం బాగా కష్టపడ్డాడు. అయితే విజయ్ కి పాటల్లో డాన్స్ చేయడం వంటివి ఇష్టం లేకపోయినా సినిమా కోసం చేసాడని స్వయంగా తానే ప్రమోషన్స్ లో చెప్పాడు. ఇక దీనిపై మాట్లాడుతూ విష్ తనకు నచ్చని పనులను కుడా ఇష్టంగా విజయ్ చేస్తాడు. సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అంటూ చెప్పారు.
లైగర్ సినిమా విడుదల అయి మిశ్రమ స్పందన వినిపిస్తున్న ఈ తరుణంలో వినిపిస్తున్న మాట ఒకటే లైగర్ సినిమా మొదట బన్నీ తో చేయాలని పూరి అనుకున్నా చివరికి విజయ్ దేవరకొండతో తీశారు కథ బన్నీ కోసం సిద్ధం చేసాడు అని వినిపించాయి. అయితే దీనిపై స్పందిస్తూ విష్ణు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు, అలాంటిదేమి లేదని, పూరి జగన్నాథ్ తో ఎప్పుడు ఒక ఇరవైకి పైగానే స్క్రిప్ట్లు రెడీ గా ఉంటాయి దాంట్లో ఏ హీరో అప్పుడు చేయడానికి దొరుకుతాడో ఆ హీరోతో ఒక స్క్రిప్ట్ చేస్తాడు అంతే కానీ ఒకరి కోసం పూరి ఎదురుచూడడు అంటూ విష్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…