Vishwak sen: నిత్య మీనన్ తో పులిహోర కలవడానికి ప్రయత్నించిన విశ్వక్ సేన్.. గాలి తీసిన నిత్యమీనన్!
Vishwak sen: తెలుగు ఓటీటీ ఆహాలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ సింగింగ్ కాంపిటీషన్ కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ కంటెస్టెంట్, సింగర్ శ్రీరామచంద్ర వ్యాఖ్యాతగా వ్యవహరించాగా… మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్, హీరోయిన్ నిత్యామీనన్, సింగర్ కార్తీక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం ఈ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ దక్కించుకొని దూసుకుపోతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వారం ముఖ్యఅతిథిగా పాగల్ హీరో విశ్వక్ సేన్ వచ్చారు. ఈ క్రమంలోనే ఈయన సింగర్ లాలసతో కలిసి మాస్ స్టెప్పులు వేశారు. ఈ విధంగా సింగర్లతో కలిసి ఎంతో సందడి చేసిన విశ్వక్ తన డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో జడ్జీలను అడిగారు.
ఈ క్రమంలోనే ఎస్.ఎస్.తమన్ లేచి నిలబడి తన ఫర్ఫార్మెన్స్ క్లాప్ కొట్టగా విశ్వక్ మోకాళ్లపై అభినందనలు తెలిపారు. ఇక విశ్వక్సేన్ నిత్య మీనన్ తో పులిహోర కలపడానికి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే నిత్యామీనన్ తో మాట్లాడుతూ నేను మీకు పెద్ద అభిమానిని అలా వైకుంఠపురం సినిమా నుంచి నేటి భీమ్లా నాయక్ సినిమా వరకు అని చెబుతూ ఉండగా మధ్యలో నిత్యమీనన్ అడ్డుపడింది.
అది అలా వైకుంఠపురం కాదు.. అలా మొదలైంది అంటూ తన సినిమా పేరును గుర్తు చేస్తూ విశ్వక్ సేన్ గాలి తీసింది. దీంతో విశ్వక్ అలా వైకుంఠపురం అలా మొదలైంది రెండు ఒకేలా ఉండటంతో కన్ఫ్యూస్ అయ్యానని ఏదో కవర్ చేశారు.ఇంక సింగర్ జయంత్ కు బిర్యానీ అంటే ఇష్టమని తెలుసుకున్న విశ్వక్ తనకి బిర్యాని తీసుకువచ్చి సర్ప్రైజ్ చేశారు. ఇక విశ్వక్ సినిమాల విషయానికి వస్తే ఆయన నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…