General News

Vizag Pregnant women murder : బిడ్డ పుడితే నన్ను వదలదు.. ఆ కారణంతోనే చంపేశాడు.. ఏసీపీ విచారణ లో షాకింగ్ నిజాలు…!

Vizag Pregnant women murder : ఈ మధ్య కాలంలో ప్రేమించడం, ప్రేమించలేదని చంపేయడం ఒకవేళ ప్రేమిస్తే పెళ్ళి చేసుకోవాల్సి వస్తుందని చంపడం లేదా పెళ్ళి అయ్యాక గొడవలు పడి చంపేయడం ఇలా ఏదో ఒక కారణంతో హత్య చేయడం అనేది సాధారణం అయిపోయింది. క్షణికవేశంలో తీసుకునే నిర్ణయం వల్ల ఒక నిండు ప్రాణం పోతోంది. ఇక తాజాగా విశాఖపట్నం లో జరిగిన హత్య మాత్రం మరింత హేయమైంది. నిండు గర్భిణీ ని గొంతు నూలుమి కట్టుకున్న భర్తే కడతేర్చాడు. ఇంకా భూమి పైకి రాని బిడ్డను చంపేశాడు కసాయి తండ్రి. అసలేం జరిగిందంటే…

డెలివరీ ఐతే వదలదని చంపేశాడు…

అనూష, జ్ఞానేశ్వర్ అనే ఇద్దరు ప్రేమించి 2022 లో పెళ్లి చేసుకున్నారు. అనూష అక్క,బావ ఆమె స్నేహితుల సమక్షంలో పెళ్ళి జరిగింది. ప్రస్తుతం గర్భిణీ గా ఉన్న అనూష మరి కొద్ది రోజుల్లో తల్లి కాబోతున్న సమయంలో ఆమెను గొంతు నులిమి చంపేశాడు భర్త జ్ఞానేశ్వర్. అనూష అక్క చెబుతున్న ప్రకారం చాలా రోజుల నుండి జ్ఞానేశ్వర్ ఇద్దరం విడిపోదాం మా తల్లిదండ్రులకు తెలిస్తే ఇద్దరిని చంపేస్తారు అంటూ ఒకసారి నాకు క్యాన్సర్ ఉంది నీ దారి నువ్వు చూసుకో విడిపోదాం అంటూ మరోసారి ఇలా తరచూ చెప్పేవాడని కానీ తన చెల్లి పెళ్లయింది తనతోనే జీవితాంతం ఉంటానంటూ చెప్పేదని అనూష సోదరి విలపించారు.

బిడ్డ పుడితే ఇక అసలు వదిలి పోదని ఆమెను చంపేసాడని చనిపోయే రాత్రి కూడా ఆమె సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టిందని తన భర్త బాగా చూసుకుంటున్నట్లు చెప్పేదని అనూష సోదరి చెబుతోంది. ఇక ఏసీపీ గారు మాట్లాడుతూ తన భార్య తనని వేరే అమ్మాయితో ఉన్నావా అంటూ అనుమానించిందని అలా మాట మాట పెరిగి ఆవేశంలో గొంతు నులిమి చంపేసానని చెప్పాడని ఇతనికి పెళ్ళి జరిగిన విషయం అతని తల్లిదండ్రులకు బంధువులకు తెలియదు అందుకే ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని ఇలా చేసినట్లు ఇంకా విచారణలో మిగిలిన విషయాలు తెలియాల్సిన ఉందని చెప్పారు. అమ్మాయిలు ప్రేమించేటపుడు జాగ్రత్తగా ఉండాలంటూ చెప్పారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago