టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన తాజా వ్యూహం. ఎన్నో అడ్డంకులు దాటుకుని తాజాగా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఏపీ రాజకీయాలపై తెరకెక్కించిన చిత్రమిది. అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్ జంటగా నటించారు. దాసరి కిరణ్ కుమార్ ప్రొడ్యూస్ చేశారు. ఇకపోతే మరి తాజాగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? కథ ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే..
కథ :
హెలికాప్టర్ ప్రమాదంలో ఏపీ సీఎం వీర శేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన తనయుడు మదన్ ను ముఖ్యమంత్రి చేయాలని 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేస్తారు. ఆ ప్రతి పాదనను కాదని కాశయ్యను ఏపీకి సీఎం చేస్తుంది భారత్ పార్టీ మేడం. మదన్ చేపట్టిన ఓదార్పు యాత్ర సైతం ఆపమని చెబుతుంది. హై కమాండ్, భారత్ పార్టీని లెక్క చేయకుండా మదన్ ముందుకు వెళతాడు. వీసీపీ పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళతాడు. దాంతో అతని మీద కేసులు, ఇన్వెస్టిగేషన్లు మొదలవుతాయి. తనపై వచ్చిన కేసులను ఎదుర్కొని, ప్రత్యర్థులను తట్టుకుని మదన్ ఎలా సీఎం అయ్యాడు? భార్య మాలతి, తల్లి జయమ్మ, చెల్లెలు నిర్మల నుంచి ఎటువంటి సహకారం లభించింది. తారా ఇంద్రబాబు నాయుడు, శ్రవణ్ కళ్యాణ్ కలిసి ఏం చేశారు? చివరకు ఏమైంది? లాంటి ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ :
ఈ సినిమాను కల్పిత కథ పాత్రలతో తలకెక్కించామని చెప్పినప్పటికీ గత ఏమిటి అనేది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసిందే. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన కొడుకు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏపీ రాజకీయాల్లో ఏం జరిగిందనేది చిత్ర కథాంశం.
రామ్ గోపాల్ వర్మ టార్గెట్ ఏమిటనేది సోషల్ మీడియాలో ఆయన్ను ఫాలో అయ్యే వాళ్లకు ఈజీగా అర్థం అవుతుంది. వ్యూహం లోనూ అంతే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవిపై తనదైన శైలిలో వర్మ సెటైర్లు వేశారు. తెలుగు దేశం, జనసేన పార్టీ వ్యతిరేకులతో పాటు వైసీపీ అభిమానులతో ఈలలు, చప్పట్లు కొట్టే సన్నివేశాలు ఉన్నాయి
నటీనటుల నటన:
జగన్ మోహన్ రెడ్డి పాత్రలో నటించిన అజ్మల్ అమీర్ పూర్తిగా తన పాత్రకి న్యాయం చేసారు. అచ్చం వైయస్ జగన్ బాడీ లాంగ్వాజ్ మాట తీరు దించేశారు. తన భార్య మాలతి పాత్రలో మానస కూడా ఎంతో అద్భుతంగా నటించారు. ఇంద్రబాబు పాత్రలో ధనంజయ్ ఎంతో అద్భుతమైనటువంటి నటన కనపరిచారు. ఇలా ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించారు.
టెక్నికల్ :
టెక్నికల్ పరంగా రాంగోపాల్ వర్మ మార్క్ కొన్ని సన్నివేశాలలో స్పష్టంగా కనిపించింది. సినిమాకు తగ్గట్టుగా సినిమాటోగ్రఫీ సెట్ అయింది. మధ్య మధ్యలో రాంగోపాల్ వర్మ వాయిస్ హైలెట్ అయింది. కెమెరా విజువల్స్ కూడా అద్భుతంగా అనిపించాయి.
ప్లస్ పాయింట్స్: నటీనటుల నటన, కథ.
మైనస్ పాయింట్స్: అందరికి తెలిసిన కథ అవ్వడం
రేటింగ్: 3
కోర్టు ఆదేశాలతో ‘మెగా’ నిర్ణయం తెలుగు చలనచిత్ర పరిశ్రమ (TFI) చరిత్రలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. సినిమాలపై సోషల్ మీడియాలో…
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…