Waltair Veerayya -Veera Simha Reddy: సంక్రాంతి పండుగ వచ్చిందంటే సినిమాల సందడి మామూలుగా ఉండదు. సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి.అయితే చాలా సంవత్సరాలు తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నటువంటి చిరంజీవి బాలకృష్ణ మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది. ఈ సంక్రాంతికి వీరిద్దరీ సినిమాలు పోటీకి సై అంటున్నాయి.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి అనే సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ రెండు సినిమాలలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన విశేషం. ఇప్పటికే ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఇద్దరు హీరోల అభిమానుల మధ్య కూడా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది.
ఈ సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా 88 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకోగా బాలయ్య వీర సింహారెడ్డి సినిమా 73 కోట్ల బిజినెస్ జరుపుకుంది. ప్రీరిలీజ్ బిజినెస్ పరంగా చూసుకుంటే చిరంజీవి ముందు వరుసలో ఉన్నారు. అయితే ఈ సినిమాల ఫలితం పై వీరి ముందు సినిమాల ప్రభావం కూడా చూపుతుందని పలువురు ట్రేడ్ వర్గాల నిపుణులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే చిరంజీవి ముందుగా నటించిన ఆచార్య సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అనంతరం వచ్చిన గాడ్ ఫాదర్ పాజిటివ్ టాక్ వచ్చిన పెద్దగా వసూలు రావట్లేదు అయితే బాలకృష్ణ విషయంలో అఖండ మాత్రం బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.ఇక బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమంలో ద్వారా కూడా మంచి పాజిటివ్ ఒపీనియన్ కలిగి ఉన్నారు.మొత్తానికి ఈ సంక్రాంతి కానుకగా ఈ ఇద్దరు హీరోల సినిమాలు పోటీపడి ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమాలపై అభిమానులు కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సంక్రాంతి ఎవరికి విజయం అందిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాలి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…