War 2: టాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ సినిమాలలో నటిస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ థర్టీ సినిమా షూటింగ్ పనులలో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు.
ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో. అందుకు తగ్గట్లుగానే కొరటాల శివ భారీ కథతో ఎన్టీఆర్ 30 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానుల ఆనందపడే ఒక క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది. ఎన్టీఆర్ థర్టీ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించాల్సి ఉంది. అయితే ఇటీవల ఎన్టీఆర్ మరొక సినిమా గురించి అధికారికంగా ప్రకటించాడు.
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వార్ 2 అఫీషియల్ గా ప్రకటించారు. వార్ పార్ట్ 1 లో హృతిక్, టైగర్ ష్రాఫ్ కలసి నటించారు. ఇక పార్ట్ 2 లో టైగర్ ష్రాఫ్ బదులు ఎన్టీఆర్ సెలెక్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ క్రేజీ కాంబినేషన్ గురించి దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ఒక వార్త ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతోంది.
మొదట వార్ 2కి రౌడీ హీరో విజయ్ దేవరకొండని అనుకున్నట్లు తెలుస్తోంది. లైగర్ సినిమా విడుదలకి ముందు టైగర్ ష్రాఫ్ స్థానంలో విజయ్ దేవరకొండ అయితే బాగుంటుందని అనుకున్నారు. అయితే లైగర్ సినిమా విడుదల తరువాత ఆ ఆలోచనలో మార్పు వచ్చిందట. అందువల్ల ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ని సంప్రదించగా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…