Sampath Raj: పెళ్లి విషయంలో ఆ తప్పు కారణంగా విడాకులు తీసుకున్నాం.. సంపత్ రాజ్ కామెంట్స్!
Sampath Raj:టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సంపత్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన మొదటగా దమ్ము, పంజా సినిమాల్లో నటించినప్పటికీ ఈయనకు సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు వచ్చింది. ఇలా మిర్చి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈయనకు వరుస అవకాశాలు వచ్చాయి.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ విలన్ గా ఎన్నో సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈ నటుడు తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంపత్ రాజ్ ఎన్నో విషయాల గురించి చర్చించారు.ముఖ్యంగా తన విడాకుల విషయం గురించి సంపత్ రాజ్ ఈ సందర్భంగా బయటపెట్టారు.
ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ తనకు తన భార్యకు సఖ్యత లేకపోవడం కారణంగా విడాకులు తీసుకున్నానని విడాకులు తీసుకోవడంతో తన కూతురు చాలా బాధ పడిందని ఆయన తెలియజేశారు.అసలు విడాకులు తీసుకోవడానికి కూడా కారణం పెళ్లి విషయంలో చేసిన చిన్న తప్పు అని వెల్లడించారు.
చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య అవగాహన లేక పోయింది. అందుకే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని సంపత్ రాజ్ ఈ సందర్భంగా తెలిపారు.అందుకే చిన్న వయసు లోనే ఎవరు పెళ్లి చేసుకోవద్దని తన కూతురికి కూడా ఇదే విషయాన్ని బాగా అర్థమయ్యేలా తెలియజేశారని నటుడు తెలిపారు. విడాకుల తర్వాత తన కూతురికి అన్నీ తానే చూసుకున్నట్లు తెలిపారు.సినిమాలలోకి రాకముందు అడ్వర్టైజింగ్ కంపెనీ ఉండేదని కన్నడలో ఓ సినిమా చేస్తున్న సమయంలో విడాకులు అయ్యాయని తెలిపారు.ఇక తనకు బాలీవుడ్లో అవకాశాలు కూడా వస్తున్నాయని అయితే సరైన కథనం దొరికినప్పుడే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తానని నటుడు సంపత్ ఈ సందర్భంగా తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…