కెరీర్ పీక్ లో పెళ్లి, కట్ చేస్తే విడాకులు.. సోనియా అగర్వాల్ ను అంధకారంలోకి నెట్టిన పరిస్థితులు ఏంటి.?!

తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైన “7/Gబృందావన్ కాలనీ” సినిమాతో ఒక్కసారిగా మెరిసిన అందాల భామ సోనియా అగర్వాల్. ఏ.ఎం రత్నం తనయుడు రవికృష్ణ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించింది. సోనీయా అగర్వాల్ ఆ సినిమా దర్శకుడు సెల్వరాఘవన్ ప్రేమలో పడింది. తెలుగుతో పాటు తమిళంలో తన అందచందాలతో కుర్రకారును ఆమె ఒక ఊపు ఊపింది.సోనియా అగర్వాల్ నటిగానే కాకుండా మోడల్ గా కూడా రాణించింది.

కెరీర్ పీక్ లో పెళ్లి, కట్ చేస్తే విడాకులు.. సోనియా అగర్వాల్ ను అంధకారంలోకి నెట్టిన పరిస్థితులు ఏంటి.?!

2002లో “నీ ప్రేమకై” అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆమె సినిమాల కంటే ముందుగా బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించింది. కేరీర్ ప్రారంభంలోనే ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ 2006లో సెల్వ రాఘవన్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కొద్దిరోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్న సోనియా అగర్వాల్, సెల్వ రాఘవన్ తో మనస్పర్థల కారణంగా 2009లో విడాకులు తీసుకుంది.

కెరీర్ ఆరంభంలో..7/G బృందావన్ కాలనీ సినిమా ఆమెకు ఓవర్ నైట్ స్టార్ డమ్ తీసుకువచ్చింది. ఈ సినిమాతో ఆమెకు యూత్ లో ఎక్కువ ఫాలోయింగ్ పెరిగింది. అయితే పెళ్లి తర్వాత భర్త కోరిక మేరకు సినిమాలకు పూర్తిగా దూరమైంది. పెళ్లి చేసుకోవడం, ఆమెకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం చిత్రాల ఆఫర్ ను తిరస్కరించడం లాంటి కారణాల వలన ఆమె సినిమాలలో నటించ లేకపోయింది. ఒక విధంగా చెప్పాలంటే..పెళ్లి అనే చట్రంలో ఇరుక్కు పోవడంతో కొంత స్వేచ్ఛను కోల్పోవల్సివచ్చింది. ఇలాంటి విషయాల్లో సోనిఅగర్వాల్ కి సెల్వరాఘవన్ కి మనస్పర్ధలు రావడంతో మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో విడాకులు తీసుకున్నారు.

కానీ అప్పటికే సోనీ అగర్వాల్ కెరీర్ ఫేడ్ అవుట్ అయింది. ఆమె ఎంత ప్రయత్నించినా మళ్లీ ట్రాక్ లోకి రాలేకపోయింది. సోనియా అగర్వాల్ ఇటీవలికాలంలో రెండో ఇన్నింగ్స్ లో టెంపర్ లాంటి సినిమాల్లో ఓ చిన్న పాత్రలో కనిపించారు. పట్టుమని మూడు సంవత్సరాలు కూడా సరిగా కాపురం చేయని ఈ జంట.. విడాకులతో తమ జీవితాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే తన బంగారు భవిష్యత్తును పెళ్లి అనే పేరుతో సోనియా అగర్వాల్ నాశనం చేసుకుందని చెప్పవచ్చు.