Featured

Tollywood Top Disaster Movies: మొదటి రోజే భారీ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్న టాలీవుడ్ టాప్ చిత్రాలు ఇవే?

Tollywood Top Disaster Movies: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హిట్ ఫ్లాప్ లు రావడం సర్వసాధారణం. ఒక సినిమాలో స్టార్ హీరోలు నటించినప్పటికీ కథ బాగుంటేనే ఆ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారు. లేదంటే ఎలాంటి స్టార్ హీరో అయినా ఆ సినిమాకి ప్లాప్ ట్యాగ్ వేస్తారు.ఇకపోతే గత కొంతకాలం నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోల మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. అదేవిధంగా సినిమాలు కూడా భారీ బడ్జెట్ స్థాయిలో తెరకెక్కుతున్నాయి.

Tollywood Top Disaster Movies: మొదటి రోజే భారీ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్న టాలీవుడ్ టాప్ చిత్రాలు ఇవే?

ఇలా వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు విడుదలకు ముందే భారీ ఎత్తున బిజినెస్ చేస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి విజయం సాధించగా, మరికొన్ని సినిమాలు అంచనాలను చేరుకోలేక మొదటి షో తోనే ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. అయితే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్లాప్ సినిమాలుగా నిలిచిన సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…

Tollywood Top Disaster Movies: మొదటి రోజే భారీ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్న టాలీవుడ్ టాప్ చిత్రాలు ఇవే?

ప్రభాస్: బాహుబలి సినిమా తర్వాత ఈయన క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ క్రమంలోనే ఈ సినిమా తర్వాత ఆయన నటించిన సాహో, రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.

చిరంజీవి:చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి షో ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత నటించిన సైరా నరసింహారెడ్డి కూడా అంతంత మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంది.

బాలకృష్ణ:బాలకృష్ణ నటించిన అఖండ సినిమా అఖండమైన విజయాన్ని అందుకొని బాలయ్య అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చింది.అయితే బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారకరామారావు బయోపిక్ చిత్రంగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని మిగిల్చింది.

మహేష్ బాబు: సర్కారు వారి పాట సినిమా మొదటి షో తో నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మంచి విజయాన్ని అందుకుంది. అయితే మహేష్ బాబు హీరోగా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ నెంబర్ వన్ నేనొక్కడినే, బ్రహ్మోత్సవం, స్పైడర్ వంటి సినిమాలు చేదు అనుభవాన్ని మిగిల్చింది.

వందల కోట్ల నష్టాలను మిగిల్చిన సినిమాలు…

పవన్ కళ్యాణ్: పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో గత కొంత కాలం నుంచి కొమరం పులి, అజ్ఞాతవాసి, సర్దార్ గబ్బర్ సింగ్, వంటి సినిమాలు ఈయనకు ఫ్లాప్ గా నిలిచాయి. అదేవిధంగా రామ్ చరణ్ వినయ విధేయ రామ, ఆచార్య సినిమాలు ఫ్లాప్ అవగా అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమాలన్నీ కూడా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ సినిమాలుగా నిలిచాయి.ఈ సినిమాలతో డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా కొన్ని వందల కోట్ల రూపాయలను నష్టపోయారని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago