Featured

Agneepath Scheme: అగ్నిపథ్ స్కీమ్ అంటే ఏమిటి.. అగ్నిపథ్ స్కీమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జయప్రకాష్ నారాయణ?

Agneepath Scheme: అగ్నిపథ్ గత కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా ఈ స్కీమ్ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా యువతను సైన్యంలోకి తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు.భారత సైన్యాన్ని మరింత శక్తివంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకు వచ్చింది.

Agneepath Scheme: అగ్నిపథ్ స్కీమ్ అంటే ఏమిటి.. అగ్నిపథ్ స్కీమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జయప్రకాష్ నారాయణ?

ఈ పథకంలో భాగంగా 17.5 నుంచి 21 సంవత్సరాలు వయస్సున్న యువకుల ను ఈ పథకం ద్వారా సైన్యంలోకి ఆహ్వానిస్తున్నారు. ఎంపికైన వారికి ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చే అనంతరం మూడున్నర సంవత్సరాల పాటు సర్వీస్ లో ఉంచుతారు. వీరిలో ప్రతిభ ఆధారంగా 25% మందిని శాశ్వత కమిషన్ లో పనిచేయడానికి అవకాశం కల్పిస్తారని వెల్లడించారు. తొలి సంవత్సరం రూ.4.76 లక్షల ప్యాకేజీ అందిస్తారు. వీరిని అగ్నివీరులుగా అభివర్ణిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Agneepath Scheme: అగ్నిపథ్ స్కీమ్ అంటే ఏమిటి.. అగ్నిపథ్ స్కీమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జయప్రకాష్ నారాయణ?

ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రతిపక్షాలు పూర్తిగా వ్యతిరేకిస్తూ పలు చోట్ల ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ పథకం గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయానని,దేశం రాష్ట్రం అభివృద్ధి కోసం కాకుండా వచ్చే ఎన్నికలలో అధికారం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ఏదైనా ఒక పథకం గురించి అధికారపక్షం నిర్ణయం తీసుకుని ఆ పథకం గురించి ప్రతిపక్షం మరుక్షణమే తీవ్రస్థాయిలో ఆందోళనలు చేయడం సర్వసాధారణం అయింది.

ప్రస్తుతం ఉన్న రాష్ట్ర రాజకీయాలు జాతీయ స్థాయిలో రాజకీయాలు కూడా ఇదే ధోరణిలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం భారత దేశ సైనిక దళాలను పెంచడం కోసం ఈ పథకాన్ని తీసుకు వచ్చింది. అయితే మనకు ఎంత సైన్యం ఉన్నారు అనేది ముఖ్యం కాదు ఆ సైన్యం ఎంత సమర్థవంతంగా ఉన్నారనేది ముఖ్యం అని జయప్రకాశ్ నారాయణ ఈ సందర్భంగా వెల్లడించారు.ఇలా అధిక మొత్తంలో సైన్యాన్ని తీసుకొని వారికి అధిక స్థాయిలో జీతభత్యాలు చెల్లిస్తూ సరైన శిక్షణ లేకపోతే కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎన్నికల కోసమే ఉద్యోగ ప్రకటనలు…

అమెరికా వంటి దేశాలలో సైన్యం తక్కువగా ఉన్నప్పటికీ వారి దగ్గర అధునాతనమైన సాంకేతిక శక్తిని కలిగి ఉంది. అత్యాధునికమైన ఆయుధాలు ఉండటం వల్ల దేశ భద్రత మరింత పటిష్టంగా ఉంది. మనదేశంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలను విడుదల చేస్తూ వారికి నెలవారి జీతాలు ఇస్తున్నారు తప్ప ఎక్కడ ఏ స్థాయిలో ఉద్యోగుల అవసరం అనే విషయం గుర్తించలేదు. కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే ఎన్నికల కోసం ఆలోచన చేస్తూ ఇలాంటి ధోరణిని ఎంపిక చేసుకుంటున్నారని ఆయన వెల్లడించారు. ఒక పై అధికారికి డ్రైవర్ బంట్రోతు అందరూ ఉన్నారు అధికారికి సేవ చేసే వాళ్ళు ఉన్నారు కానీ దేశ ప్రజలకు సేవ చేసేవాళ్ళు లేరని తెలిపారు.

మన దేశంలో సరైన విద్య, సరైన ఆరోగ్యం లేదు. కొన్ని ప్రాంతాలలో శాంతి భద్రత కూడా లేదు.వీటిపై దృష్టి పెట్టకుండా కేవలం వచ్చే ఎన్నికలపై దృష్టి పెడుతూ ప్రధాన మంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు మనకు ఎంతమేర సైన్యం అవసరం అనే విషయాన్ని ఆలోచించకుండా ఒకేసారి లక్షలు ఉద్యోగ ప్రకటన ఇస్తే వారికి తదుపరి ఎన్నికలలో ప్రయోజనకరంగా ఉంటుందనేది వారి ఉద్దేశమని ఈయన ఈ అగ్నిపథ్ స్కీమ్ గురించి తన అభిప్రాయాలను తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago