ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండియాలో సింగపూర్ వేరియంట్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సింగపూర్ వేరియంట్ మనదేశంలోకి వ్యాపిస్తే దాని ప్రభావం పిల్లలు ఎక్కువగా చూపించే అవకాశాలు ఉన్నాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.కానీ సింగపూర్ వేరియంట్ అనేది అవాస్తవం అని అసలు నిజం తెలిస్తే ప్రతి ఒక్కరూ ఎంతో షాక్ కి గురి అవుతారు అని చెప్పవచ్చు.
తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో వర్చువల్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ..సింగపూర్ వేరియంట్ వల్ల పిల్లలకు ఎక్కువగా కరోనా సోకే ప్రమాదం ఉందనీ, అందుకోసమే సింగపూర్ కి విమాన సర్వీసులను నిలిపివేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రధాన మంత్రిని కోరారు. ఇప్పటికే పిల్లలతో థర్డ్ వేవ్ అధిక ప్రభావం చూపిస్తుందని, నిపుణులు హెచ్చరిస్తున్న సమయంలో తెరపైకి సింగపూర్ వేరియంట్‌పై భయంకరమైన ప్రచారం మొదలైంది. ఈ అంశంపై లోతుగా వెళ్తే… ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది..
సింగపూర్ వేరియంట్ అంటే B.1.617. చాలా మంది ఈ వేరియంట్ ఇండియలోకి వస్తే ఎంతో ప్రమాదకరం అని భావిస్తున్నారు.అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ప్రస్తుతం ఇండియాలో తీవ్రరూపం దాలుస్తున్నటువంటి వేరియంట్ B.1.617. ఈ వేరియంట్ నే అనధికారికంగా ఇండియన్ వేరియంట్ అని కూడా పిలుస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇండియాలో వ్యాపిస్తున్న ఈ వేరియంట్ వల్ల పిల్లలు కూడా కరోనా బారిన పడుతున్నట్లు మనం చూస్తున్నాము.
ప్రస్తుతం ఈ వేరియంట్ సింగపూర్ లో కనిపించడం వల్ల సింగపూర్ ప్రభుత్వం నేటి నుంచి స్కూల్, కాలేజీలకు సెలవులు ప్రకటించింది.ఈ విధంగా సింగపూర్ ప్రభుత్వం చేపట్టిన ప్రకటనతో కంగారుపడిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రధానమంత్రి ఈ విషయంపై చర్చించారు. ఇందులో నిజం ఏమిటంటే సింగపూర్ లో కన్నా ముందుగానే వేరియంట్ B.1.617 ఇండియాలో ఉందనేది వాస్తవం అని, ఈ వేరియంట్ మరింత మ్యుటేషన్ జరిగే థర్డ్ వేవ్ గా పిల్లల పై ప్రభావం చూపిస్తోందని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ విషయంలో నిజం ఉన్నా లేకున్నా పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…