గుజరాత్ విమాన ప్రమాదం ఎంత విషాదకరమో కదా! ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కానీ, ఆ దుర్ఘటనలోనూ ఒక అద్భుతం జరిగింది. కళ్ల ముందే విమానం మంటల్లో కాలిపోతుంటే, అందులో ఉన్న 242 మందిలో ఎవరూ బతికి ఉండరని అందరూ అనుకున్నారు. కానీ, రమేష్ విశ్వాస్ కుమార్ అనే 34 ఏళ్ల యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

అతను 11A సీటులో కూర్చున్నానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అధికారులు టికెట్ల జాబితాలో చెక్ చేసి, వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఇంతకీ 11A సీటులో ఏముంది ప్రత్యేకత అని అందరూ గూగుల్ లో వెతకడం మొదలుపెట్టారు.
అసలు విషయం ఏంటంటే.. బోయింగ్ విమానంలో 11A సీటు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ (PAC)కి దగ్గరగా ఉండటం వల్ల అక్కడ కిటికీ ఉండదు. అందుకే చాలామంది ఆ సీటును ఎంచుకోరు. సుదీర్ఘ ప్రయాణాల్లో అయితే అస్సలు వద్దనుకుంటారు. ఐరోపా దేశాల్లో ఈ సీటు గురించి జోకులు కూడా పేలుతుంటాయి. అంతేకాదు, ఈ సీటు ధర కూడా లక్ష రూపాయలకు పైగా ఉంటుందట. కానీ, రమేష్ మాత్రం ఆ సీటులో సర్దుకుపోయి లండన్ వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఎమర్జెన్సీ మార్గానికి దగ్గరగా ఉండటం వల్లనో ఏమో, చావును జయించి బయటపడ్డాడు. అదృష్టం అంటే ఇతనిదే కదా!
ఎయిర్ ఇండియా ప్రమాదంలో మృత్యుంజయుడు..
— BIG TV Breaking News (@bigtvtelugu) June 12, 2025
ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డ రమేష్ విశ్వాస్ కుమార్
ప్రమాదం జరిగే సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకేసిన 11A సీటులోని రమేష్ pic.twitter.com/Qdn6Pzkho1



























