Health News

శరీరంలో వేడి తగ్గాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా..?

వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల చాలామంది శరీరంలో కూడా పెద్దఎత్తున మార్పులు చోటుచేసుకుంటాయి. కొందరికి చలికాలంలో కూడా శరీరంలో ఎక్కువగా వేడి ఉండటం వల్ల అనేక సమస్యలతో సతమతమవుతుంటారు. శరీరంలో వేడి ఎక్కువగా ఉండటం ద్వారా శరీరం పై పొక్కులు ఏర్పడటం, నోట్లో పుండ్లు ఏర్పడటం, చెమట కాయలు, ముక్కు ద్వారా రక్తం కారడం,తరచూ వళ్ళు వేడి అవుతూ జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే శరీరంలో అధిక వేడి వల్ల సతమతమయ్యేవారు వారి ఆహార విషయంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా శరీరంలో వేడిని కొంత వరకు తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవారు వీలైనంత వరకు నీటి శాతం అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. అలాగే రాత్రి పడుకునే సమయంలో పెరుగన్నం తప్పకుండా తీసుకోవాలి. వీలైతే ఒక గ్లాసు పలుచటి మజ్జిగను తాగడం ద్వారా శరీర వేడిని కొంతవరకు తగ్గించవచ్చు. అలాగే నీటిశాతం అధికంగా ఉన్న పుచ్చకాయ, కీర దోసకాయ, దానిమ్మ వంటి పండ్లను తరచూ తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.

ఈ సమస్య తగ్గాలంటే నీటిలో మెంతుల పొడి వేసుకుని తాగటం ద్వారా మన శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు. కొంతమందిలో ఈ వేడి ఉండటంవల్ల మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. వీలైనంత వరకు చల్లటి గాలి తగిలే ప్రదేశాలలో ఉండటం వల్ల ఈ సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. ఈ పద్ధతులన్నీ పాటించినప్పటికీ కూడా వారిలో ఏ మాత్రం మార్పు రాకపోతే వైద్యుని సంప్రదించడం ఎంతో ఉత్తమం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

9 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

9 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

11 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

11 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

11 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

12 hours ago