Featured

Puspha Movie: ‘పుష్ప’ చూస్తున్నప్పుడు వణికిపోయాను… ఎంతగానో ఆకట్టుకుంది.. పుష్ప పై విజయేంద్రప్రసాద్ కామెంట్స్!

Puspha Movie:క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా డిసెంబర్ లో విడుదల అయి బాక్సాఫీసు దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్ ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ పుష్ప మానియా కొనసాగుతూనే ఉంది.

Puspha Movie: పుష్ప చూస్తున్నప్పుడు వణికిపోయాను…ఎంతగానో ఆకట్టుకుంది.. పుష్ప పై విజయేంద్రప్రసాద్ కామెంట్స్!

ఇదిలా ఉండగా తాజాగా పుష్ప సినిమాపై ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి తండ్రిగా ప్రముఖ సినీ రచయితగా విజయేంద్రప్రసాద్ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. బాహుబలి, త్రిబుల్ ఆర్, బజరంగీ భాయ్ వంటి అద్భుతమైన చిత్రాలకు కథను అందించిన రచయితగా విజయేంద్రప్రసాద్ మంచి గుర్తింపు పొందారు.

Puspha Movie: పుష్ప చూస్తున్నప్పుడు వణికిపోయాను…ఎంతగానో ఆకట్టుకుంది.. పుష్ప పై విజయేంద్రప్రసాద్ కామెంట్స్!

సినిమా విజయవంతం కావాలంటే కథ కీలకమైనది. అలాంటి కథను అందించడంలో విజయేంద్రప్రసాద్ సహజ సిద్ధుడు. ఈ సందర్భంగా ఆయన ఒక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కథను అందించడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్ ఉంటుందని తెలిపారు.

సినిమా సినిమాకి కొత్తదనం…

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు తనకు ఎంతగానో నచ్చుతాయని ఆయన వెల్లడించారు. కథను చెప్పడంలో సుకుమార్ స్టైల్ వేరేగా ఉంటుంది. ఒక సినిమాకి మరొక సినిమాకి సుకుమార్ ఎంతో కొత్తదనం చూపిస్తారు. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా చూస్తూ నేను వణికిపోయాను. ఆ సినిమా నన్ను ఎంతగానో ఆకట్టుకుందంటూ విజయేంద్రప్రసాద్ పుష్ప సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక ఒక రచయితగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విజయేంద్రప్రసాద్ మరో సినిమా గురించి ఇలా మాట్లాడటంతో ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago