Featured

RRR Movie: ‘కొమ్మ ఉయ్యాలా… కోన ఉయ్యాల’ అంటూ పాడిన సింగర్ ఎవరో.. తన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం RRR. ఈ సినిమా మార్చి 25 వ తేదీ విడుదల అయి బాక్సాఫీసు వద్ద అద్భుతమైన రికార్డులను దక్కించుకుంది. ఇకపోతే ఈ సినిమా ఒక అద్భుతమైన పాటతో మొదలవుతుంది. మల్లీ పాత్రలో ఒక గిరిజన చిన్నారి పాడిన కొమ్మ ఉయ్యాలా… కోన ఉయ్యాల అనే పాటతో మొదలవుతుంది.

RRR Movie: కొమ్మ ఉయ్యాలా… కోన ఉయ్యాల అంటూ పాడిన సింగర్ ఎవరు… తన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

ఇక ఈ పాట ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పవచ్చు.ఈ విధంగా ఇంత అద్భుతమైన పాటలు పాడిన ఆ చిన్నారి ఎవరు అంటూ పెద్దఎత్తున ఈ పాట పాడిన సింగర్ కోసం నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మరి ఈ పాట పాడిన చిన్నారి ఎవరు? తన బ్యాక్గ్రౌండ్ ఏంటి? అనే విషయానికి వస్తే…

RRR Movie: కొమ్మ ఉయ్యాలా… కోన ఉయ్యాల అంటూ పాడిన సింగర్ ఎవరు… తన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

ఎంతో అద్భుతమైన ఈ పాటను పాడిన చిన్నారి పేరు ప్రకృతి రెడ్డి. ఈమె 2010 సంవత్సరం కర్ణాటక బళ్ళారి లో జన్మించారు. చిన్నప్పటి నుంచి సంగీతంపై ఎంతో ఆసక్తి ఉన్న ప్రకృతి రెడ్డికి తన తల్లిదండ్రులు చదువుతోపాటు సంగీతంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఇలా సంగీతంలో ఎంతో ప్రావీణ్యం పొందిన ఈమె ఎన్నో సింగిగ్ కాంపిటీషన్ కార్యక్రమాలలో పాల్గొని ప్రముఖ సింగర్ లచే ప్రశంసలు అందుకున్నారు.

ప్రముఖులచే ప్రశంశలు..

కేవలం కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు హిందీ తమిళ భాషల్లో కూడా అద్భుతమైన పాటలు పాడుతూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక తెలుగులో ప్రసారమైన పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొన్న ఈ చిన్నారి తన పాటలతో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనసును కూడా దోచుకున్నారు.సింగింగ్‌ రియాల్టీ షో ‘తారే జమీన్‌ పర్‌’లో పాల్గొని శంకర్ మహదేవన్ ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇలా ఎన్నో స్టేజ్ షో లలో అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చూపించిన ప్రకృతి రెడ్డికి RRR సినిమాలో పాట పాడే అవకాశం కల్పించారు. ఇక ఈ పాటతో ఈమె ఒక్కసారిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago