RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం RRR. ఈ సినిమా మార్చి 25 వ తేదీ విడుదల అయి బాక్సాఫీసు వద్ద అద్భుతమైన రికార్డులను దక్కించుకుంది. ఇకపోతే ఈ సినిమా ఒక అద్భుతమైన పాటతో మొదలవుతుంది. మల్లీ పాత్రలో ఒక గిరిజన చిన్నారి పాడిన కొమ్మ ఉయ్యాలా… కోన ఉయ్యాల అనే పాటతో మొదలవుతుంది.

ఇక ఈ పాట ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పవచ్చు.ఈ విధంగా ఇంత అద్భుతమైన పాటలు పాడిన ఆ చిన్నారి ఎవరు అంటూ పెద్దఎత్తున ఈ పాట పాడిన సింగర్ కోసం నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మరి ఈ పాట పాడిన చిన్నారి ఎవరు? తన బ్యాక్గ్రౌండ్ ఏంటి? అనే విషయానికి వస్తే…

ఎంతో అద్భుతమైన ఈ పాటను పాడిన చిన్నారి పేరు ప్రకృతి రెడ్డి. ఈమె 2010 సంవత్సరం కర్ణాటక బళ్ళారి లో జన్మించారు. చిన్నప్పటి నుంచి సంగీతంపై ఎంతో ఆసక్తి ఉన్న ప్రకృతి రెడ్డికి తన తల్లిదండ్రులు చదువుతోపాటు సంగీతంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఇలా సంగీతంలో ఎంతో ప్రావీణ్యం పొందిన ఈమె ఎన్నో సింగిగ్ కాంపిటీషన్ కార్యక్రమాలలో పాల్గొని ప్రముఖ సింగర్ లచే ప్రశంసలు అందుకున్నారు.
ప్రముఖులచే ప్రశంశలు..
కేవలం కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు హిందీ తమిళ భాషల్లో కూడా అద్భుతమైన పాటలు పాడుతూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక తెలుగులో ప్రసారమైన పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొన్న ఈ చిన్నారి తన పాటలతో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనసును కూడా దోచుకున్నారు.సింగింగ్ రియాల్టీ షో ‘తారే జమీన్ పర్’లో పాల్గొని శంకర్ మహదేవన్ ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇలా ఎన్నో స్టేజ్ షో లలో అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చూపించిన ప్రకృతి రెడ్డికి RRR సినిమాలో పాట పాడే అవకాశం కల్పించారు. ఇక ఈ పాటతో ఈమె ఒక్కసారిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
































