Singer Sunitha: సింగర్ సునీత తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.ఈమె ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇలా హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నటువంటి సునీత కెరియర్ ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ ఈమె వ్యక్తిగత జీవితంలో మాత్రం కాస్త ఒడిదుడుకులు ఉన్న విషయం మనకు తెలిసిందే.

మొదటిసారి వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత మొదటి భర్త తనని విడిచి వెళ్లడం ఒంటరిగా పిల్లలను పెంచి పెద్ద చేయడం ఈమెకు ఎంతో కష్టతరంగా మారింది. అయితే ఇలా ఈమె కష్టాలు అనుభవిస్తున్న సమయంలో తనకు చేదోడు వాదోడుగా ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు తనకు ఎంతో అండగా నిలిచారని పలుమార్లు సునీత వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే సునీత మరోసారి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడుతూ ఆయనని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు అని తెలిపారు. ఆయన మరణం నాకు తీరని లోటు.తను మరణించిన తరువాత నా కళ్ళ నుంచి నీళ్లు రావడం ఆగిపోయాయి. అంతకన్నా ఏ సంఘటనలు తనని కదిలించలేకపోయాయని తెలిపారు.

Singer Sunitha: ఆయన చూపించిన మార్గంలో నడవడమే నేను ఇచ్చే గౌరవం…
ఇలా కష్ట సమయాలలో నాకు ఎంతో అండగా నిలిచి ఆయన నాకు ఓ మార్గాన్ని చూపించారు. ఆయన చూపించిన మార్గంలో నడవడమే ఆయనకు నేను ఇచ్చే గౌరవం అంటూ ఈ సందర్భంగా సునీత ఎస్పీ బాలసుబ్రమణ్యం గారిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం సునీత బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






























