Vithika sheru: సినీ ఇండస్ట్రీలో హిట్టు ఫ్లాపులు అన్నవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే హీరోగా హ్యాపీ డేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు వరుణ్ సందేశ్. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన అనంతరం కొత్త బంగారులోకం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు..

ఈ సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయం అందుకుంది. ఈ రెండు సినిమాలలో కాలేజీ కుర్రాడి పాత్రలో నటించిన వరుణ్ మంచి సక్సెస్ అందుకోవడంతో ఈయనకి వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి అయితే తదుపరి నటించిన సినిమాలన్నీ కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి. దీంతో ఈయన కొంత కాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఇక చాలా రోజుల తర్వాత నింద అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు . ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ సినిమా ఈనెల 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిఖిల్ అతిథిగా రాగా వరుణ్ భార్య వితికా కూడా హాజరయ్యారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చాలామంది వరుణ్ ఇండస్ట్రీలో గ్యాప్ తీసుకోవడం గురించి ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా వితికా మాట్లాడుతూ.. చాలామంది వరుణ్ ను ఫెయిల్యూర్ హీరో అంటున్నారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా 17 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు ఫెయిల్యూర్ అంటే పూర్తిగా ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్లడం.
మా ఆయన ఫెయిల్యూర్ కాదు..
ఫ్లాప్స్ రాగానే సినిమా ఇండస్ట్రీని వదిలివేసి వెళ్లిపోయే వాళ్ళు ఫెయిల్యూర్ అయినట్టు కానీ మా ఆయన అలా చేయలేదు. మా ఆయన ఫెయిల్యూర్ యాక్టర్ కాదు అని చెప్తూ స్టేజిపై ఎమోషనల్ అయింది. దీంతో అభిమానులు ఇలా భర్తకు ఈమె సపోర్ట్ చేయడం పై ప్రశంసలు కురిపించారు ఇలాంటి భార్య ఉంటే ఏ భర్త అయినా ఎప్పుడు ఫెయిల్యూర్ కారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.



























