Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు. బిగ్ బాస్ కార్యక్రమంలోకి ఒక సాధారణ వ్యక్తి లాగా వెళ్లిన ఈయన అనంతరం ఒక సెలబ్రిటీగా బయటకు వచ్చారు. సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఒక కామన్ మాన్ గా వెళ్లి విన్నర్ గా నిలిచారు. ఈయన గెలిస్తే తనకు వచ్చే డబ్బులను రైతులకు అందజేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు కేవలం ఈయన ఒక లక్ష రూపాయలు మాత్రమే ఒక కుటుంబానికి సాయం చేశారు.

ఇలా తరచూ పల్లవి ప్రశాంత్ ఎప్పుడు రైతులకు సహాయం చేస్తారు అంటూ నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ ఈయన మాత్రం రైతులకు డబ్బు పంచిన సందర్భాలు మాత్రం లేవని చెప్పాలి. అయితే తాజాగా పల్లవి ప్రశాంత్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఈ కారుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను ఈయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
తాను గురువుగా భావించే శివాజీతో కలిసి కారు కొనడానికి వెళ్లినటువంటి ప్రశాంత్ మొదటిసారి శివాజీ చేత కారు నడిపారు. అనంతరం ఈయన ఓపెన్ టాప్ కి వెళ్లి కాస్త ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామం కొందరికి కాలుతుంది అన్నాడు. సామాన్యుడు పైకి రావాలని అన్నాడు.
గెలుపు కోసం సింపతి డ్రామాలు..
ఈయన కారు కొనడంలో తప్పులేదు కానీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నేను గెలిస్తే రైతులకు పంచుతాను అని సింపతి డ్రామాలు చేసి,ఓట్లు వేయించుకొని గెలుపొంది ఇప్పుడు డబ్బు పంచకుండా తిరుగుతున్నాడు. అన్ని విషయాలలో తనకు సలహాలు ఇచ్చే శివాజీ ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు. ఈయన బాధ్యతను మరిచి బాగా జల్సాలకు అలవాటు పడ్డారని నెటిజన్స్ ఈయనపై కామెంట్ లు చేస్తున్నారు.



























