Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక రష్మిక మందన్న వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులకు పంచుకుంటూ ఉంటారు. ఇకపోతే తాజాగా ఈమె ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గం గం గణేశా సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఆనంద్ దేవరకొండ బేబీ సినిమా తర్వాత నటించినటువంటి ఈ సినిమా మే 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి రష్మిక హాజరు కావడంతో ఆనంద రష్మిక మధ్య చాలా సరదా సంభాషణ జరిగింది.ముందుగా రష్మిక తన పెట్స్ తో దిగిన ఫోటోస్ చూపిస్తూ అందులో ఏది ఫేవరేట్ అని అడగ్గా.. ఆరా రష్మిక పెట్ డాగ్.. తన ఫస్ట్ బేబీ అని.. స్మార్ట్ విజయ్ పెట్ డాగ్ తన సెకండ్ బేబీ అని చెప్పడం గమనార్హం.
ఇక ఆనంద్ దేవరకొండ నీ ఫేవరెట్ కోస్టార్ ఎవరు అంటూ రష్మికను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రష్మిక చేతిలో మైక్ పక్కనపెట్టి నీ యబ్బ అంటూ సరదాగా తిట్టింది. ఆ తర్వాత వెంటనే మైక్ లో ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీ రా.. ఇలా స్పాట్ లో పెడితే ఎలా అంటూ సరదాగా మాట్లాడారు. అనంతరం తన ఫేవరెట్ కోస్టార్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ అంటూ ఈమె సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా కేకలు అరుపులు వేశారు అభిమానులు.
నువ్వు నా ఫ్యామిలీ…
రష్మిక మందన్న విజయ్ దేవరకొండ పలు సినిమాలలో నటించారు. అయితే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని కానీ ఈ విషయాన్ని వారు బయట పెట్టడం లేదనీ వీరి రిలేషన్ గురించి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా తన ఫేవరెట్ కోస్టార్ విజయ్ దేవరకొండ అంటూ ఈమె సమాధానం చెప్పడంతో ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ అవుతున్నాయి.



























