Namrata: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో భార్యగా మంచి సక్సెస్ అందుకున్నారు నటీ నమ్రత. ఈమె బాలీవుడ్ నటి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నమ్రత తెలుగులో మహేష్ బాబుతో కలిసి వంశీ అనే సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ బాబుతో ఈమె ప్రేమలో పడ్డారు.

ఇలా మహేష్ బాబుతో ప్రేమలో ఉన్నటువంటి నమ్రత మూడు సంవత్సరాల తర్వాత ఆయనని పెళ్లి చేసుకున్నది ఇక పెళ్లి తర్వాత ఈ స్టార్ హీరోయిన్ అయినప్పటికీ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇక ఈమెకు తెలుగులో పెద్ద పెద్ద సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ సినిమాలకు పూర్తిగా దూరమవుతూ కుటుంబ బాధ్యతలను అలాగే మహేష్ బాబు సినిమా బాధ్యతలను చూసుకుంటూ ఉన్నారు.
ఇలా మహేష్ సినిమా వ్యవహారాలన్నింటిని చెక్క పెట్టడమే కాకుండా ఎన్నో కమర్షియల్ బిజినెస్లను కూడా నిర్వహిస్తూ బిజినెస్ ఉమెన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నమ్రతకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. మీరు కనుక మహేష్ బాబు సినిమాలో ఆయన పక్కన నటించే అవకాశం వస్తే నటిస్తారా అనే ప్రశ్న ఎదురయింది.
రీ ఎంట్రీ ఛాన్స్ లేదు..
ఈ ప్రశ్నకు నమ్రత సమాధానం చెబుతూ తాను ఇకపై సినిమాలలో నటిస్తూ కెమెరా ముందుకి రావాలని అసలు అనుకోవడం లేదని తెలిపారు. అది మహేష్ బాబు సరసన అయినా కూడా తాను నటించననీ కచ్చితంగా చెప్పేసారు. ఇలా రీఎంట్రి గురించి నమ్రత ఫుల్ క్లారిటీ ఇస్తూ తాను సినిమాలలో నటించే ప్రసక్తే లేదని చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.



























